AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Groundnut: గరిబోళ్ల బాదం.. పోషకాల వేరుశనగ.. ఇలా ఎందుకంటారో మీకు తెలుసా..?

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామంది ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. చెడు ఆహారపు అలవాట్ల వల్ల మనుషుల్లో జీర్ణక్రియ సమస్య తలెత్తుతోంది.

Groundnut: గరిబోళ్ల బాదం.. పోషకాల వేరుశనగ.. ఇలా ఎందుకంటారో మీకు తెలుసా..?
Peanuts
Shaik Madar Saheb
|

Updated on: Oct 04, 2022 | 6:46 PM

Share

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామంది ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. చెడు ఆహారపు అలవాట్ల వల్ల మనుషుల్లో జీర్ణక్రియ సమస్య తలెత్తుతోంది. దీని కారణంగా వారి బరువు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. రోజూ వేరుశెనగ తినడం వల్ల శరీరంలోని జీవక్రియలు మెరుగుపడుతాయి. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు పొట్టను కూడా క్రమంగా తగ్గించేలా చేస్తుంది. వేరుశెనగ మనకు ఎలాంటి ప్రయోజనాలను ఇస్తుందో తెలుసుకుందాం..

వేరుశనగలో అనేక పోషకాలు ఉన్నాయి

వేరుశెనగను ఫైబర్, విటమిన్ల మంచి మూలంగా పరిగణిస్తారు. యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిలోని కాల్షియం శరీరంలోని ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

వేరుశనగ ప్రయోజనాలు

  • టైప్ 2 డయాబెటిస్‌పై ప్రభావాన్ని చూపుతుంది. మథుమేహం నియంత్రణకు క్రమంగా పనిచేస్తుంది.
  • మహిళల్లో టైప్ 2 డయాబెటిస్‌కు వ్యతిరేకంగా వేరుశెనగ చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది.
  • వేరుశెనగ తక్కువ గ్లైసెమిక్ ఫుడ్ విభాగంలో వస్తుంది. దీని కారణంగా ప్రజల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
  • శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో వేరుశెనగ సహాయపడుతుంది.
  • ఇది గుండె జబ్బులను దరిచేరనీయదు. ఇంకా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • యాంటీ ఏజింగ్‌గా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
  • మీరు మీ రోజువారీ ఆహారంలో వేరుశెనగతో సహా గింజలను తీసుకుంటే మీరు ఇతర వ్యక్తుల కంటే యవ్వనంగా కనిపిస్తారని ఒక పరిశోధనలో తేలింది.
  • వేరుశెనగ మరణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

దీనిని ‘పేదల బాదం’ అని ఎందుకు అంటారు?

వేరుశెనగలో దాదాపు బాదంపప్పులో ఉండే పోషక విలువలు ఉన్నాయయి. బాదంపప్పుతో పోలిస్తే దీని ధర కూడా చాలా తక్కువ. అందుకే దీన్ని ‘పేదల పండు’ లేదా ‘పేదల బాదం’ అని పిలుస్తారు. కొంతమంది దీనిని ‘దేశీ జీడిపప్పు’ అని కూడా పిలుస్తారు.

వేరుశెనగలను ఇలా తినండి..

రాత్రి పడుకునే ముందు వేరుశెనగలను నీటిలో నానబెట్టి, ఆ తర్వాత మరుసటిరోజు చిరుతిండిగా తీసుకోండి. తినడానికి ముందు వేరుశెనగలో ఉన్న నీటిని వడబోసి తాగాలని గుర్తుంచుకోండి. దీనితో పాటు, రాత్రిపూట తినడం మానుకోండి. ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి