Male Infertility: పురుషులు స్పెర్మ్ కౌంట్ లేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారా..? ఈ విత్తనాలను తీసుకోండి అద్భుతమైన ఫలితాలు
ఈ రోజుల్లో చాలా మంది రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు చాలా మంది. ముఖ్యంగా ఈ రోజుల్ల సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతుంటారు..
ఈ రోజుల్లో చాలా మంది రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు చాలా మంది. ముఖ్యంగా ఈ రోజుల్ల సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతుంటారు. చాలా మంది పురుషులలో స్పెర్మ్ కౌంట్ లేకపోవడం కూడా మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు. సరిగ్గా లేని జీవనశైలి కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణం కావచ్చు. చాలా మంది పెళ్లి అయిన తర్వాత స్పెర్మ్ కౌంట్ సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలు పుటే అవకాశం ఉండదు. చాలా మంది పురుషులు స్పెర్మ్ కౌంట్ పెంచడానికి ఎంతో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అయితే ఫలితం ఉండదు.
అయితే పురుషుల్లో వీర్య కణాలను పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా కణాల సంఖ్య తగ్గిపోవడంతో మానసికంగా కుంగిపోయే వారు చాలా మంది ఉంటారు. అయితే వీడి సంఖ్య పెంచుకునేందుకు ఎన్నో ఆస్పత్రుల చుట్టు తిరుగుతుంటారు. జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని విత్తనాలను తీసుకోవడం వల్ల ఆ స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. రోజువారీ దినచర్యలో ఏ విత్తనాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చో తెలుసుకుందాం.
- మెంతులు: మెంతి గింజలకు ఆయుర్వేదంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇవి ఆయుర్వేదంలోని ఎన్నో ఔషదాలకు ఉపయోగిస్తుంటారు. వీటి దాని సహాయంతో మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. మీరు తక్కువ స్పెర్మ్ కౌంట్ లేదా సంతానోత్పత్తి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే మీరు ప్రతిరోజూ మెంతులు ఉన్న నీటిని తాగాలి. మెంతులను రాత్రి నానబెట్టి, ఉదయం ఈ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
- పొద్దుతిరుగుడు విత్తనాలు: ఈ పొద్దుతిరుగుడు విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. రకమైన విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడతాయి. మీకు కావాలంటే వీటిని నీటిని మరిగించి తాగవచ్చు లేదా మీరు దానిని షేక్ లేదా స్మూతీ ద్వారా తినవచ్చు.
- గుమ్మడికాయ గింజలు: ఇలాంటి విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. మీరు ఆహారంలో చేర్చడానికి దాని కూరగాయలను తినవచ్చు. ఈ గింజల ద్వారా స్పెర్మ్ కౌంట్ పెరగడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.
- చియా విత్తనాలు: ఈ చియా విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. చియా గింజలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ దెబ్బతినకుండా కాపాడతాయి. సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి. మీరు చియా విత్తనాలను అనేక విధాలుగా తినవచ్చు. అయితే వాటిని పెరుగుతో తినడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి