Health Tips: రాత్రివేళ ఈ పనులు చేస్తే.. పడుకున్న వెంటనే హాయిగా నిద్రపడుతుంది..

ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలా మంది లేజీగా, నీరసంగా కనిపిస్తారు. దీనికి ప్రధాన కారణం రాత్రిపూట మంచిగా నిద్రపోకపోవడం.

Health Tips: రాత్రివేళ ఈ పనులు చేస్తే.. పడుకున్న వెంటనే హాయిగా నిద్రపడుతుంది..
Sleeping
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 04, 2022 | 7:04 PM

ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలా మంది లేజీగా, నీరసంగా కనిపిస్తారు. దీనికి ప్రధాన కారణం రాత్రిపూట మంచిగా నిద్రపోకపోవడం. ప్రస్తుత కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇలా ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు నిద్రలేకుండా ఉంటే ఫర్వాలేదు.. కానీ రోజూ రాత్రి నిద్ర రాకపోయినా.. గంటల తరబడి నిద్ర లేకుండా మంచంపైనే గడుపుతున్నా దీనిని అస్సలు విస్మరించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నిద్ర లేకపోవడం మీ ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. అందువల్ల, ముఖ్యంగా మీ జీవనశైలి, ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఇంకా మంచం మీద పడుకున్న వెంటనే నిద్రపోయేలా కొన్ని పద్ధతులను కూడా అనుసరించవచ్చు. అటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని రోజూ అనుసరించడం ద్వారా మీరు మంచం మీద పడుకున్న వెంటనే నిద్రపోతారు.

మంచి నిద్ర కోసం పడుకునే ముందు ఈ పనులు చేయండి

తిన్న వెంటనే నిద్రపోకండి: మీరు ఆహారం తీసుకున్న వెంటనే పడుకోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే, ఆహారం జీర్ణం కావడం కష్టమై రాత్రిపూట నిద్ర కూడా పట్టదు. అందుకే రాత్రిపూట బాగా నిద్రపోవాలంటే నిద్రకు 4 గంటల ముందు ఆహారం తినాలి. రాత్రి వేళ సరిపడా నీళ్లు తాగిన తర్వాత నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది.

ఇవి కూడా చదవండి

నిద్రపోయే ముందు స్నానం చేయండి: రాత్రిపూట నిద్రరాకపోతే.. స్నానం చేయడం చేయడం మంచిగా నిద్రపోవచ్చు. నిద్రపోయే ముందు ఎప్పుడూ స్నానం చేయడం అనేది జీవితంలో అలవర్చుకోవాలి. రాత్రి స్నానం చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రం అవ్వడమే కాకుండా, అలసట కూడా తొలగిపోతుంది.

పడుకునే ముందు లైట్ ఆఫ్ చేయండి: పడుకునే గదిలో లైట్ ఆఫ్ చేసుకోవడం ద్వారా నిద్రకు అంతరాయం కలగదు. ఇంకా చిన్న నూనె దీపం వెలిగించుకోని నిద్రపోవచ్చు.

పుస్తకాలు చదవండి: నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం, ఇష్టమైన మ్యూజిక్ వినడం మంచిది. ఇలా చేస్తే రిలీఫ్ తోపాటు.. హాయిగా నిద్రపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి