Health: భారతీయుల్లో గుండెపోటుకు అసలు కారణం ఇదేనట.. 10 మందిలో ఆరుగురికి ఈ పెను సమస్య.. పూర్తి వివరాలు..

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతోపాటు గుండె జబ్బుల ప్రమాదం కూడా నానాటికీ పెరుగుతోంది.

Health: భారతీయుల్లో గుండెపోటుకు అసలు కారణం ఇదేనట.. 10 మందిలో ఆరుగురికి ఈ పెను సమస్య.. పూర్తి వివరాలు..
Heart Attack
Follow us

|

Updated on: Oct 04, 2022 | 9:29 PM

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతోపాటు గుండె జబ్బుల ప్రమాదం కూడా నానాటికీ పెరుగుతోంది. అయితే, ఈ ప్రమాదానికి అసలు కారణం చెడు కొలెస్ట్రాల్ అని తాజా పరిశోధనలో తేలింది. హెల్త్-టెక్ సంస్థ, హెల్తీయన్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో ప్రతి 10 మంది భారతీయులలో ఆరుగురికి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా అసాధారణ స్థాయిలో ఉందని తేలింది. 31 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు చెడు కొలెస్ట్రాల్ అత్యధికంగా ఉన్నట్లు తేలింది. 63 శాతం మంది రక్తంలో అధిక LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) కొలెస్ట్రాల్‌ను కలిగి ఉన్నట్లు అధ్యయనం కనుగొంది. భారతదేశంలోని 250 నగరాల్లో 20 ఏళ్లు పైబడిన 2.66 మిలియన్ల మంది వ్యక్తులపై నిర్వహించిన రక్త పరీక్షల డేటాను ఈ సంస్థ ఉపయోగించి.. పరిశోధనలు నిర్వహించింది.

ఈ పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులు అనుభవించే అధిక-ఒత్తిడి స్థాయిలకు ఇది సూచన కావచ్చని హెల్తియన్స్ ల్యాబ్ ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ సోనాల్ అభిప్రాయపడ్డారు. “ఈ వయస్సులో అధిక ఒత్తిడి స్థాయిలకు ఇది సూచన కావచ్చు. ఈ రోజుల్లో పెరుగుతున్న కార్డియాక్ అరెస్ట్‌లకు ఇది ఒక కారణమే” అని ఆమె వివరించారు.

దీనిపై గుర్గావ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, క్లినికల్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ ఇమేజింగ్ డైరెక్టర్, హెడ్ డాక్టర్ వినాయక్ అగర్వాల్ న్యూస్ 9తో ప్రత్యేకంగా మాట్లాడారు. అధిక కొలెస్ట్రాల్ అనేది కార్డియోవాస్క్యులార్ డిసీజ్ (సివిడి) స్పెక్ట్రం పెరుగుదలకు దారితీసే కొన్ని సాధారణ ప్రమాద కారకాలు.. అవి గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం, అనేక ఇతర గుండె సంబంధిత సమస్యలను పెంచుతాయన్నారు.

ఇవి కూడా చదవండి

31-40 మధ్య వయస్సు ఉన్నవారే అత్యధికం..

10 మంది భారతీయులలో ముగ్గురు తమ రక్తప్రవాహంలో ఎక్కువ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉన్నట్లు నివేదించారు. 31-40 ఏళ్ల మధ్య ఉన్నవారిలో ఇది అత్యధిక ప్రాబల్యం కనిపించింది. అలాగే 40-60 ఏళ్ల మధ్య ఉన్న భారతీయుల్లో 36 శాతం మంది కొలెస్ట్రాల్ అసాధారణ స్థాయిలో ఉన్నట్లు నివేదించారు. అదేవిధంగా, 60-70 ఏళ్లలో 30 శాతం, 70-80 ఏళ్లలో 24 శాతం కొలెస్ట్రాల్ అసాధారణ స్థాయిలను నివేదించినట్లు పరిశోధకులు తెలిపారు.

కొలెస్ట్రాల్-సంబంధిత పారామితుల విషయానికి వస్తే 36 శాతం మంది భారతీయులు హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ అసాధారణ స్థాయిలను కలిగి ఉన్నారు. వీటిని మంచి కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. 39 శాతం మందికి ట్రైగ్లిజరైడ్‌ల అసాధారణ స్థాయిలు, 30 శాతం మంది అసాధారణ మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉన్నారు.

అధిక కొలెస్ట్రాల్ ఎప్పుడై ప్రమాదంగా మారుతుంది. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ భాగం LDL, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు తెలిపారు.

అత్యల్పంగా గుజరాత్, అత్యధికంగా బెంగళూరులో..

ఈ పరిశోధనలో పురుషులు LDL, ట్రైగ్లిజరైడ్స్, మొత్తం కొలెస్ట్రాల్ అసాధారణ స్థాయిల పరంగా అధిక ప్రాబల్యాన్ని నివేదించారు. పరీక్షించిన పురుషులలో 64 శాతం మందికి అసాధారణమైన ఎల్‌డిఎల్ ఉంది. 47 శాతం మంది అసాధారణ ట్రైగ్లిజరైడ్‌లను కలిగి ఉన్నారు. 32 శాతం మంది అసాధారణ కొలెస్ట్రాల్ కలిగి ఉన్నారు. దీనితో పోలిస్తే 63 శాతం, 30 శాతం, 29 శాతం మహిళలు ఉన్నారు. అయినప్పటికీ, పురుషులతో పోలిస్తే ఎక్కువ మంది మహిళలు అసాధారణ HDL స్థాయిలను కలిగి ఉన్నారు.

హెల్త్-టెక్ సంస్థ సర్వే నిర్వహించిన నగరాలకు 10 స్కోర్‌లను కూడా ఇచ్చింది. ఎక్కువ స్కోర్లు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తక్కువగా సూచిస్తున్నాయి. గుజరాత్‌లోని వడోదరకు అత్యధిక స్కోరు 7. ఆ తర్వాత లూథియానా, జలంధర్‌లు 6.8 శాతంతో నిలిచాయి. అమృత్‌సర్, అహ్మదాబాద్, లక్నో, పానిపట్, పంచకుల, చండీగఢ్, పాటియాలా వంటి నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి. పంజాబ్‌లో ఐదు నగరాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

అదే సమయంలో, కర్ణాటకలోని మైసూరు, బెంగళూరులు 10కి 4.8 వద్ద అత్యల్పంగా స్కోర్ లో నిలిచాయి. ఎందుకంటే ఈ నగరాల్లోని జనాభాలో అసాధారణమైన LDL, ట్రైగ్లిజరైడ్స్, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. అధ్యయనం ప్రకారం.. బెంగళూరు 4.9 స్కోర్ సాధించింది. రాష్ట్రంలో పేలవమైన ఆహారం, అధిక ఆల్కహాల్ తీసుకోవడం, చెడు, నిశ్చల జీవనశైలి దీనికి కారణం అని అధ్యయనం పేర్కొంది.

సాధారణ జీవనశైలి మార్పుల ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు..

జీవనశైలి మార్పులు లేదా పద్దతులు, వారానికి నాలుగైదు రోజుల పాటు కనీసం 40 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మీ ఆహారంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గడం, పిజ్జాలు, చిప్స్, ఫవ్స్ వంటి జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండి ఈ ప్రమాదాలను నివారించవచ్చని డాక్టర్ అగర్వాల్ చెప్పారు. “ఈ రోజుల్లో పిల్లలు కూడా జంక్ ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకుంటున్నారు.. అది వారి బరువు, ఆరోగ్యానికి ఆటంకం కలిగిస్తుంది. ఎక్కువగా యువతలో మధుమేహం, ఊబకాయం ప్రారంభంలోనే ఉన్నట్లు మేము గమనిస్తున్నాము.” అని తెలిపారు.

ఆయన మాట్లాడిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. వారిని చిన్న వయస్సులోనే అవగాహన కల్పించాలని సూచించారు. “ప్రారంభ దశలోనే పిల్లలను గుర్తించండి, తద్వారా నివారణ చర్యలు తీసుకోవచ్చు.. వేయించిన ఆహారాన్ని తగ్గించండి, జంక్ ఫుడ్‌లను తగ్గించండి. అర్థరాత్రి అతిగా తినడం తగ్గించండి, బాగా నిద్రపోండి, ఉప్పు పదార్థాలకు దూరంగా ఉండేలా చూసుకోండి.” అని పలు సూచనలు చేశారు.

అన్ని రోగాలను నియంత్రించడంలో ముఖ్యమైనది జీవనశైలి, ఆహారం.. సాధారణ జీవనశైలి మార్పుల ద్వారా ఈ ప్రమాద కారకాల ప్రభావాన్ని తగ్గించవచ్చని డాక్టర్ తెలిపారు. మీ ఆహారంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు, ఎక్కువ సలాడ్ లను తీసుకోవడం ఈ వ్యక్తులకు అవసరం.. ఇది మంచి జీవనం కూడా.. అటువంటి రోగులలో వినోదం, విశ్రాంతి, ధ్యానం ఇలా ప్రతిదీ పని చేస్తుంది. మెరుగైన జీవితాన్ని అందిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్