LLC 2022: ధోని స్నేహితుడి వీరవిహారం.. సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు.. కట్ చేస్తే.. మ్యాచ్ విన్నర్..

సింహం ఎంత వయసొచ్చినా వేటాడటం మర్చిపోదు.. అలాగే షేన్ వాట్సన్ కూడా అంతే! రిటైర్మెంట్ ఇచ్చి ఉండొచ్చు గానీ..

LLC 2022: ధోని స్నేహితుడి వీరవిహారం.. సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు.. కట్ చేస్తే.. మ్యాచ్ విన్నర్..
Shane Watson
Follow us

|

Updated on: Oct 04, 2022 | 6:18 PM

సింహం ఎంత వయసొచ్చినా వేటాడటం మర్చిపోదు.. అలాగే షేన్ వాట్సన్ కూడా అంతే! రిటైర్మెంట్ ఇచ్చి ఉండొచ్చు గానీ.. తన బ్యాట్ వేగం ఇంకా తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ ప్రత్యర్ధి బౌలర్లపై వీరవిహారం చేశాడు. 24 బంతుల్లో 48 పరుగులు చేసిన వాట్సన్.. తన జట్టు భిల్వారా కింగ్స్‌కు అద్భుత విజయాన్ని అందించడమే కాదు.. టోర్నమెంట్ ఫైనల్‌కు చేర్చాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. దిల్షాన్(36), యశ్‌పాల్ సింగ్(43), కెవిన్ ఓ బ్రెయిన్(45), జీవన్ మెండిస్(24) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోర్ సాధించగలిగింది. ఇక భిల్వార్ కింగ్స్ బౌలర్లలో శ్రీశాంత్ 2 వికెట్లు.. బ్రెస్నాన్, త్యాగి, రాహుల్ శర్మ, పనేసర్, ఎడ్వర్డ్స్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం 195 పరుగుల టార్గెట్ చేధించే క్రమంలో బరిలోకి దిగిన భిల్వార్ కింగ్స్‌కు ఓపెనర్లు పోర్టర్‌ ఫీల్డ్(60), వాన్ విక్(31) చక్కటి ఆరంభాన్ని అందించారు. ఇక వన్ డౌన్‌లో వచ్చిన వాట్సన్‌ అయితే ఎదుర్కున్న తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 24 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అతడికి యూసఫ్ పఠాన్(21), ఇర్ఫాన్ పఠాన్(22) చక్కటి సహకారాన్ని అందించడంతో భిల్వార్ కింగ్స్‌ జట్టు టార్గెట్‌ను సునాయాసంగా చేధించింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!