IND VS SA: రిషబ్ పంత్ పుట్టినరోజు బహుమతి అడిగితే రోహిత్ శర్మ ఏం చేశాడో తెలుసా.. ట్వీట్ తోనే ట్విస్ట్ ఇచ్చిన మాజీ క్రికెటర్..
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్, బ్యట్స్ మెన్ రిషబ్ పంత్ 25 ఏళ్లు పూర్తి చేసుకుని అక్టోబర్ 4వ తేదీ మంగళవారం 26వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రస్తుత క్రికెటర్లతో పాటు.. మాజీ క్రికెటర్లు, స్నేహితులు ఇలా ఎంతో మంది ఈ స్టార్ క్రికెటర్ కు..
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్, బ్యట్స్ మెన్ రిషబ్ పంత్ 25 ఏళ్లు పూర్తి చేసుకుని అక్టోబర్ 4వ తేదీ మంగళవారం 26వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రస్తుత క్రికెటర్లతో పాటు.. మాజీ క్రికెటర్లు, స్నేహితులు ఇలా ఎంతో మంది ఈ స్టార్ క్రికెటర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే క్రమంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా ట్విట్టర్ వేదికగా రిషబ్ పంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ట్వీట్ లోనే ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు. అందరూ చెప్పినట్లు కాకుండా ఓ మీమ్ పోస్టు చేసి పంత్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్. ఎప్పుడు విమర్శలు చేసినా, పొగడ్తల వర్షం కురిపించినా తనదైన స్టైల్ లో చేయడం వసీం జాఫర్ కు అలవాటు. దీనిలో భాగంగా పంత్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చేప్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టు చేసిన మీమ్ లో మొదటి బాక్సులో కెప్టెన్ రోహిత్ శర్మ.. రిషబ్ పంత్ ను ఇంటర్వ్యూ చేస్తూ.. పుట్టినరోజు బహుమతి ఏమి కావాలని అడుగుతున్నట్లు ఉంది. దానికి సమాధానంగా రిషబ్ పంత్ బ్యాటింగ్ అని సమాధానం ఇస్తాడు. పంత్ సమాధానానికి రోహిత్ శర్మ తనకు ఆ విషయం తెలియనట్లుగా ఫేస్ అదో రకంగా పెట్టినట్లు మూడో బాక్సులో కనబడుతోంది. మొదటి రెండు మ్యాచుల్లో ప్లేయింగ్ లెవన్ లో అవకాశం లభించినా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. దీనిని పోలుస్తూ మీమ్ పోస్టు చేయడంతో పోస్టు చేసిన కొద్దిసేపటికే వైరల్ గా మారింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడంతో రిషబ్ పంత్ కు ఆడే అవకాశ లబించింది. అయితే మొదటి టీ20లో లక్ష్యం స్వల్పం కావడంతో పంత్ అవసరం లేకుండానే భారత జట్టు విజయం సాధించిది. ఇక రెండో టీ20లో కూడా ఎక్కువ వికెట్లు పడకపోవడంతో పంత్ కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ బ్యాటింగ్ కు రావల్సి ఉన్నప్పటికి.. లాస్ట్ ఓవర్స్ కావడంతో హిట్టింగ్ కోసం దినేష్ కార్తీక్ ను బ్యాటింగ్ కు పంపించింది. దీంతో ఈరెండు మ్యాచుల్లోనూ రిషబ్ పంత్ బ్యాటింగ్ కు దిగలేకపోయాడు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా అయినా పంత్ కు బ్యాటింగ్ అవకాశం దొరుకుతుందా అనే అర్థం వచ్చేలా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఓ మీమ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
Happy Birthday @RishabhPant17 ?? #INDvSA pic.twitter.com/Oecuj9ABNV
— Wasim Jaffer (@WasimJaffer14) October 4, 2022
ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో జట్టు సభ్యులతో కలిసి పంత్ తన బర్త్ డే సెల్రేషన్స్ చేసుకున్నాడు. మూడు మ్యూచుల సిరీస్ లో ఇప్పటికే 2-0 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ చివరి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, కెఎల్.రాహుల్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే రిషబ్ పంత్ కు ఓపెనింగ్ చేసే అవకాశం రావచ్చు. మరోవైపు టీ20 ప్రపంచ కప్ లో రిషబ్ పంత్ కు ప్లేయింగ్ లెవన్ లో చోటు దక్కవచ్చనే చర్చ సాగుతోంది. మరోవైపు దినేష్ కార్తీక్ డెత్ ఓవర్లలో తనదైన బ్యాటింగ్ స్టైల్ తో ప్రత్యర్థులపై విరుచుకు పడుతుంటంతో తన స్థానాన్ఇన సుస్థిరం చేసుకున్నాడు. మంగళవారం జరిగే మూడో టీ20లో పంత్ కు అవకాశం దొరికితే ఎలా ఆతడాడనేది వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..