Betting Apps: ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ప్రసారం చేస్తే కఠిన చర్యలు.. హెచ్చరించిన కేంద్రప్రభుత్వం

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కు సబంంధించిన ప్రకటనలపై నిషేధం ఉన్నప్పటికి అటువంటి ప్రకటనలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్ సైట్లు, ఓటీటీ ప్లాట్ ఫాంలు అటువంటి ప్రకటనలు ప్రసారం చేయడంపై కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం..

Betting Apps: ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ప్రసారం చేస్తే కఠిన చర్యలు.. హెచ్చరించిన కేంద్రప్రభుత్వం
Sports Betting Apps (file P
Follow us

|

Updated on: Oct 03, 2022 | 10:46 PM

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కు సబంంధించిన ప్రకటనలపై నిషేధం ఉన్నప్పటికి అటువంటి ప్రకటనలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్ సైట్లు, ఓటీటీ ప్లాట్ ఫాంలు అటువంటి ప్రకటనలు ప్రసారం చేయడంపై కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి వాటిని ప్రసారం చేయకూడదని సూచించింది. ఈమేరకు డిజిటల్ మీడియా సంస్థలు, ఓటీటీలు, టీవీ ఛానెళ్లకు అక్టోబర్ 3వ తేదీ సోమవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది. ఇప్పటికీ కొన్ని ఛానెళ్లు, మీడియా, ఆన్‌లైన్‌ సంస్థలు బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన ప్రకటనలను ప్రసారం చేయడం తాము గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇకపై ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన యాడ్స్ ప్రసారం చేయకుండా నియంత్రణ పాటించాలని సూచించింది. కొన్ని ఆన్‌లైన్‌ బెట్టింగ్ సంస్థలు తమ ప్రచారం కోసం న్యూస్ వెబ్‌సైట్లను వాడుకుంటున్నాయని, ఈ ప్రకటనలపై నిషేధం విధిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్‌పై దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నిషేధం కూడా ఉంది. అయినా ఈ సంస్థలు తమ గేమ్స్‌ను ప్రొఫెషనల్ క్రీడల్లాగా ప్రకటించుకుంటున్నాయి. న్యూస్ వెబ్‌సైట్లు, ఛానెళ్లను ఈ సంస్థలు తమ ప్రకటనల కోసం వాడుకుంటున్నాయి. ఇకపై వీటిని ప్రసారం చేయకూడదని, ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రప్రభుత్వం హెచ్చరించింది.

ఇటీవల కాలంలో ఎక్కువ మంది, ముఖ్యంగా యువత వివిధ వెబ్ సైట్లు, ఓటీటీ ప్లాట్ ఫాంలకు సంబంధించిన యాప్ లను ఎక్కువుగా వినియోగిస్తున్నారు. దీంతో వీటిలో వచ్చే యాడ్స్ పట్ల కూడా వారు ఆకర్షితులై.. జూద క్రీడలకు అలవాటుపడే ప్రమాదం ఉందని గుర్తించిన కేంద్రప్రభుత్వం ఇటువంటి బెట్టింగ్ యాప్ యాడ్స్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రకటనలను ప్రచురించకూడదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2022 జూన్ 13 వ తేదీన వార్తా సంస్థలు, ప్రయివేట్ టీవీ ఛానెల్స్ఓ, డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ కు సూచించింది. అయినా సరే ఇంకా ఈ బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన యాడ్స్ ప్రసారం కావడాన్ని కేంద్రప్రభుత్వం సిరీయస్ గా తీసుకుంది. ఈ మేరకు అలాంటి యాడ్స్ ప్రసారం చేయవద్దంటూ హెచ్చరించింది. ఫెయిర్ ప్లే, బెట్ వే, వన్ ఎక్స్ బెట్ వంటి ఆఫ్ షోర్ బెట్టింగ్ యాప్ లు ఇప్పటికి తమ ప్రకటనలను ఇస్తుండగా.. చాలా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి. దీంతో ఇటువంటి ప్రకటనలపై నిషేధం ఉందని, ప్రసారం చేయకూడదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..