Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు ప్రేరణ ఆ ఉద్యమమే.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను ఒక బలమైన శక్తిగా నిలిపేందుకు ఆపార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పూర్తైన యాత్ర కర్ణాటకలోకి..

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు ప్రేరణ ఆ ఉద్యమమే.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..
Rahul Gandhi, Priyanka Gandhi
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 03, 2022 | 10:23 PM

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను ఒక బలమైన శక్తిగా నిలిపేందుకు ఆపార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పూర్తైన యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించగా రాహుల్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుంది. అయితే ఇదే సమయంలో అవకాశం దొరికినప్పుడల్లా రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. తన భారత్ జోడో యాత్రకు రైతు ఉద్యమమే ప్రేరణ అన్నారు. అన్నదాతలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం సాగుతుందని, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. లఖింపుర్ ఖేరీ ఘటనపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఘటన జరిగి ఏడాది అయినా.. ఇంతవరకు బాధితులకు న్యాయం జరగలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విషయాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. ఇప్పటికి అజయ్ మిశ్రా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతుండడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. మరోవైపు ప్రియాంకగాంధీ కూడా లంఖీపూర్ ఖేరీ ఘటనలో కేంద్రప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ ట్వీట్ చేశారు.

లఖింపుర్ ఘటన జరిగి ఏడాది అయినా.. అమరవీరులైన రైతులకు న్యాయం దక్కలేదన్నారు. ఎప్పటిలాగే బీజేపీ ప్రభుత్వం నేరస్థులను కాపాడుతోందని ఆరోపించారు. ఇలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్7వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర తమిళనాడు, కేరళలో పూర్తిచేసుకుని ఇటీవల కర్ణాటకలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. కాగా భారత్ జోడో యాత్ర 26వ రోజు కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ప్రవేశించింది. కాగా.. అక్టోబర్ 4, 5 తేదీలో దసరా సందర్భంగా రాహుల్ గాంధీ కొడగులో విశ్రాంతి తీసుకుంటారు. 6వ తేదీ ఉదయం భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..