ICC T20 WORLD CUP: టీ20 ప్రపంచకప్ లో అంపైర్లు వీరే.. భారత్ నుంచి ఒకే ఒక్కరు.. ఎవరంటే..
క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్ సరిగ్గా మరో 12 రోజుల్లో ప్రారంభంకానుంది. అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు జరిగే ఈ మ్యాచుల్లో భాగంగా గ్రూప్ స్థాయిలో 8, సూపర్..
క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్ సరిగ్గా మరో 12 రోజుల్లో ప్రారంభంకానుంది. అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు జరిగే ఈ మ్యాచుల్లో భాగంగా గ్రూప్ స్థాయిలో 8, సూపర్ 12లో 8 జట్లు ఆడనున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యంగా టీమ్ ఆటగాళ్లను పక్కన పెడితే గ్రౌండ్ లో మ్యాచ్ జరిగేటప్పుడు మ్యాచ్ లో కీలక పాత్ర పోషించేది అంపైర్లే. వివిధ జట్లకు ఆటగాళ్లను ఆయా దేశాల క్రికెట్ బోర్డుకు చెందిన సెలక్ట్ కమిటీ ఎంపిక చేస్తుంది. అయితే అంఫైర్లను ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఎలైట్ ప్యానల్ ఎంపిక చేస్తుంది. టీ20 ప్రపంచకప్ కోసం వివిధ దేశాలకు చెందిన మొత్తం 16 మందిని అంఫైర్లను ఎంపిక చేయగా.. వీరిలో భారత్ కు చెందిన నితిన్ మీనన్ ఉన్నారు. మీనన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లకు అంపైరింగ్ చేసేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. టీ20 ప్రపంచ కప్ లో గ్రూపు మ్యాచ్ లతో పాటు, సూపర్ 12 మ్యాచ్ ల కోసం అంపైర్ లను ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది.
ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ ప్యానెల్ టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన అంపైర్ లలో రిచర్డ్ కెటిల్‌బరో, నితిన్ మీనన్, కుమార ధర్మసేన, మరైస్ ఎరాస్మస్ లు 2021లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు అంపైర్లుగా వ్యవహరించారు. టీ20 ప్రపంచకప్ లో మొత్తం మ్యాచ్ లకు ఈ 16 మంది అంపైర్లు మాత్రమే అధికారికంగా అంపైరింగ్ చేస్తారు. ప్రపంచ స్థాయి టోర్నమెంట్లకు ఎంతో అనుభవజ్ఞలైన అంపైర్లను ఎంపిక చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతయ మ్యాచ్ లకు అంఫైరింగ్ చేసే వారిలో 16 మందిని మాత్రమే ఈ మెగా టోర్నమెంట్ కోసం ఎంపిక చేశారు. ఈ అంపైర్ల సమూహం ఎంతో అనుభవజ్ఞులతో కూడుకున్న ప్యానల్. 2021లో యుఎఇ, ఒమన్ లో జరిగిన టీ20 ప్రపంచకప్ కు కూడా 16 మంది అంపైర్లతో కూడిన ప్యాన్ లను ఎంపిక చేశారు.
అంపైర్లతో పాటు నలుగురు మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరిస్తారు. జింబాబ్వేకు చెందిన ఆండ్రూ పైక్రాఫ్ట్, ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్టోఫర్ బ్రాడ్, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ బూన్‌లతో పాటు శ్రీలంకకు చెందిన రంజన్ మడుగల్లె మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరిస్తారు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 16 నుంచి 21 వరకు గ్రూప్ స్థాయి మ్యాచ్ లు జరుగుతాయి. ఈ మ్యాచుల్లో మొదటిది అక్టోబర్ 16న శ్రీలంక, నమిబియా తలపడతాయి. అదే రోజు రెండో మ్యాచ్ లో యుఎఇ, నెదార్లాండ్ తలపడతాయి. శ్రీలంక, నమిబియా మధ్య జరిగే మొదటి మ్యాచ్ లో జోయెల్ విల్సన్, రోడ్నీ టక్కర్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. టీవీ అంఫైర్ పాల్ రీఫిల్ తో కలిసి ఎరాస్మస్ ఫోర్త్ అంపైర్ గా వకచవహరిస్తారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ కు ఎంపికైన ఎరాస్మస్, రోడ్ని టక్కర్, అలమ్ దార్ ఏడో సారి ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్ కు అంపైరింగ్ చేయనున్నారు.
అక్టోబర్ 16 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కు ఎంపికైన రిఫరీలు, అంపైర్లు
మ్యాచ్ రిఫరీలు: ఆండ్రూ పైక్రాఫ్ట్, క్రిస్టోఫర్ బ్రాడ్, డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె
అంపైర్లు: అడ్రియన్ హోల్డ్‌స్టాక్, అలీమ్ దార్, అహ్సన్ రజా, క్రిస్టోఫర్ బ్రౌన్, క్రిస్టోఫర్ గఫానీ, జోయెల్ ధర్మా విల్సన్, లాంగ్ ధర్మాన్ విల్సన్, , మరైస్ ఎరాస్మస్, మైఖేల్ గోఫ్, నితిన్ మీనన్, పాల్ రీఫిల్, పాల్ విల్సన్ , రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, రోడ్నీ టక్కర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..