AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 WORLD CUP: బుమ్రా స్థానంలో హైదరాబాదీకే షేన్ వాట్సన్ ఓటు.. ఎందుకో చెప్పిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

భారత క్రికెట్ జట్టుకు మంచి బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ ఉన్నప్పటికి, ఇటీవల కాలంలో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం బౌలర్లకు పెద్ద సమస్యగా మారింది. చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇటీవల..

ICC T20 WORLD CUP: బుమ్రా స్థానంలో హైదరాబాదీకే షేన్ వాట్సన్ ఓటు.. ఎందుకో చెప్పిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
Siraj,bumrah
Amarnadh Daneti
|

Updated on: Oct 04, 2022 | 9:39 PM

Share

భారత క్రికెట్ జట్టుకు మంచి బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ ఉన్నప్పటికి, ఇటీవల కాలంలో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం బౌలర్లకు పెద్ద సమస్యగా మారింది. చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా, తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లను భారత్ గెలుచుకున్నప్పటికి.. అక్టోబర్ నెలలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్ భారత్ కు ఒక సవాలు అనే చెప్పుకోవాలి. పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ మెగా టోర్నికి దూరమయ్యాడు. దీంతో ఇప్పుడు బౌలింగ్ టీమిండియాకు పెద్ద సమస్యగా మారింది. అయితే బుమ్రా టీ20 ప్రపంచకప్ లో ఆడలేడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించడంతో.. ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. మహ్మద్ షమి, దీపక్ చాహర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికి, హైదరాబాద్ కు చెందిన మహ్మద్ సిరాజ్ కు టీ20 ప్రపంచకప్ ప్లేయింగ్ లెవన్ లో చోటు దక్కే అవకాశాలున్నాయని క్రీడారంగ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ మీదనే మొత్తం చర్చంతా జరగుతోంది. అందులోనూ బూమ్రా స్థానంలో ఏ ఆటగాడికి చోటు దక్కుతుందనేది చాలా ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ స్పందించాడు. గాయం కారణంగా T20 ప్రపంచ కప్ కు జస్ప్రీత్ బుమ్రా దూరం కాడడంతో అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ కు చోటు దక్కుతుందని తాను అంచనా వేస్తున్నట్లు షేన్ వాట్సన్ తెలిపాడు. తాను అయితే సిరాజ్ ను ఎంచుకుంటానని చెప్పాడు. జస్ప్రీత్ బుమ్రా T20 ప్రపంచ కప్‌కు దూరమైతే అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్ భారత జట్టులోకి వస్తాడని ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. గాయం కారణంగా గత నెలలో జరిగిన ఆసియా కప్‌కు కూడా బుమ్రా దూరమయ్యాడు. అయితేగ గాయం నుంచి కోలుకోవడంతో బూమ్రాను దక్షిణాఫ్రికాతో T20I సిరీస్‌కు ఎంపికచేశారు సెలక్టర్లు. అయితే గాయం కారణంగా దక్షిణాఫ్రికా తో టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. అలాగే టీ20 ప్రపంచకప్ సమయానికి బుమ్రా కోలకోవడం కష్టమని, అందుకే అతడు అందుబాటులో ఉండదని బీసీసీఐ తెలిపింది. అయితే బూమ్రా స్థానంలో మరో ఆటగాడిని త్వరలో త్వరలో ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది.

ఐసీసీ రివ్యూకు సంబంధించిన తాజా ఎపిసోడ్ లో వాట్సన్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నమెంట్ కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోతే ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం మహ్మద్ సిరాజ్ ను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. బూమ్రా టీ20 ప్రపంచ కప్ కు దూరమవ్వడం భారత క్రికెట్ జట్టుకు నిరాశతో కూడుకున్నదే అని, ఆస్ట్రేలియా వికెట్లపై బూమ్రా లాంటి బౌలర్ భారత్ కు అవసరమన్నారు. అయితే మహ్మద్ సిరాజ్ కూడా కొత్త బంతితో బాగా రాణించగలడని తెలిపాడు. బంతిని బాగా స్వింగ్ చేయగలడని, ఐపీఎల్ మ్యాచుల్లోనూ బాగా రాణించాడని, గతంతో పోలిస్తే మరింత మెరుగ్గా ఉన్నాడని వాట్సన్ తన అభిప్రాయంగా చెప్పాడు. బూమ్రా స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు.. ఎక్కువ ప్రభావం చూపించగల వ్యక్తి సిరాజ్ కావచ్చన్నాడు. అయితే బుమ్రా అందుబాటులో లేకపోవడం టీ20 ప్రపంచకప్‌ లో భారత్ అవకాశాలను తగ్గించవచ్చని వాట్సన్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ ను భారత్ గెలుచుకునే అవకాశాలపై కూడా ఇది భారీ ప్రభావం చూపించవచ్చని తాను భావిస్తున్నట్లు వాట్సన్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..