కొన్ని రోజుల్లో పెళ్లి.. ఇంతలో బయటపడ్డ కాబోయే భార్య సీక్రెట్..సినిమాను తలపించే ట్విస్ట్..

ఇటీవలే వారిద్దరికి నిశ్చితార్ధం అయింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగబోతోంది. సీన్ కట్ చేస్తే..

కొన్ని రోజుల్లో పెళ్లి.. ఇంతలో బయటపడ్డ కాబోయే భార్య సీక్రెట్..సినిమాను తలపించే ట్విస్ట్..
Boy Shocked After Fiance Se
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 04, 2022 | 5:46 PM

ఇటీవలే వారిద్దరికి నిశ్చితార్ధం అయింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగబోతోంది. సీన్ కట్ చేస్తే.. తన కాబోయే భార్య గురించి ఓ సీక్రెట్ బయటపడింది. అంతే! అతడి గుండె ముక్కలైంది. ఆరేళ్లుగా ఆమె ఆ రహస్యాన్ని అతడి దగ్గర నుంచి దాచిపెట్టిందట. అది తెలిసిన తర్వాత సదరు యువకుడు.. ఆ యువతిని పెళ్లి చేసుకోవాలా.? లేదా.. అని ఆలోచిస్తున్నాడు. రెడిట్ వేదికగా ఓ యువకుడు చెప్పుకొచ్చిన స్టోరీ ఇది. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటి.? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళ్తే.. జాన్ అనే యువకుడు మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఈలోపే తనకు కాబోయే భార్య గురించి అతడికి ఓ రహస్యం తెలిసింది. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. ఆరేళ్లుగా ఆమె ఆ రహస్యాన్ని ఇతడి దగ్గర నుంచి దాచిపెడుతూ వచ్చింది. అయితే ఈ రహస్యం జాన్‌కు కాబోయే భార్య స్నేహితురాలు ద్వారా తెలిసింది. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటని అనుకుంటున్నారా.? సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నారా.. వెయిట్ చేయండి చెప్పేస్తాం.

తనకు కాబోయే భార్య.. తన సోదరుడి మాజీ గర్ల్ ఫ్రెండ్‌ అని జాన్‌కు తెలిసింది. అది తెలియగానే.. అతడి గుండె ముక్కలయ్యింది. ఆరేళ్లుగా ఈ రహస్యాన్ని అతడికి తెలియకుండా కాబోయే భార్య దాచిపెడుతూ వచ్చిందట. ఇదిలా ఉంటే.. వీరిద్దరికీ 5 నెలల క్రితం నిశ్చితార్ధం అయింది.. ఇప్పుడేమో ఆమె ప్రెగ్నంట్. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక.. జాన్‌ తన ఆవేదనను రెడిట్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. తనకు కాబోయే భార్య గురించి రహస్యాన్ని ఆమె స్నేహితురాలు ఒకరు చెప్పారని పేర్కొన్నాడు.

మొదట్లో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని.. కాని ఆమె ప్రూఫ్‌లతో చూపించేసరికి నమ్మాల్సి వచ్చిందన్నాడు. కాగా, ఈ విషయంపై మొదట్లో తన సోదరుడ్ని ప్రశ్నించాలని అనుకున్నానని జాన్ తెలిపాడు. కాని అతడికి పెళ్లి అయిపోవడంతో.. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకొస్తే.. తన సోదరుడి వైవాహిక జీవితం చిన్నాభిన్నం అవుతుందని అలోచించి తనలో తాను బాధపడుతున్నానని జాన్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..