గులాబ్ జామున్లు అనుమతించని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.. చివరికి ప్రయాణికుడు ఏం చేశాడంటే?
ఎయిర్‌పోర్ట్‌లో చెక్ ఇన్ టైంలో ప్రయాణికుల నుంచి అక్కడున్న అధికారులు కొన్ని వస్తువులను క్యారీ చేయడానికి అనుమతించరు.
ఎయిర్‌పోర్ట్‌లో చెక్ ఇన్ టైంలో ప్రయాణికుల నుంచి అక్కడున్న అధికారులు కొన్ని వస్తువులను క్యారీ చేయడానికి అనుమతించరు. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ఇలాంటివి చాలా కనిపిస్తుంటాయి. విమానాల్లోకి అనుమతించని ఆహార పదార్థాలను తీసుకెళ్లే వారు.. లగేజ్ చెకింగ్ తర్వాత అక్కడే వదిలేసి వెళ్తుంటారు. ఇలాంటి అనుభవమే మన దేశానికి చెందిన హిమాన్షు దేవ్‌గన్ అనే వ్యక్తికి ఫుకెట్ విమానాశ్రయంలో ఎదురైంది.
చెక్ ఇన్ సమయంలో అతని లగేజీతో పాటు ఉన్న గులాబ్ జామున్ల డబ్బాను లోపలికి తీసుకెళ్లడానికి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. ఆ క్షణంలో హిమాన్షు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. సెక్యూరిటీ సిబ్బంది వద్దన్న గులాబ్ జామున్ల డబ్బాను అక్కడే ఓపెన్ చేసి వాటిని అక్కడి సిబ్బంది అందరికీ పంచాడు. తియ్యటి గులాబ్ జామున్లు తిని అధికారులు ఇచ్చిన రియాక్షన్లను అతను రికార్డు చేశాడు.
ఈ మొత్తం వీడియోను హిమాన్షు తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయగా.. అది కాస్త వైరల్ అయింది. “సెక్యూరిటీ చెక్‌లో గులాబ్ జామున్‌లను తీసుకెళ్లడానికి అనుమతించలేదు. దాంతో, మేము మా ఆనందాన్ని వారితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాము. మేం భారతీయులం” అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను మిలియన్‌మందికి పైగా వీక్షించారు. హిమాన్షు చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
View this post on Instagram
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..