తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన వృద్దుడు.. ఎక్స్‌రే చూసి నివ్వెరపోయిన డాక్టర్లు..

ఓ వృద్దుడు తీవ్రమైన కడుపునొప్పితో స్థానిక జిల్లా ఆసుపత్రికి చేరాడు. అక్కడున్న డాక్టర్లు అతడ్ని పరీక్షించి..

తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన వృద్దుడు.. ఎక్స్‌రే చూసి నివ్వెరపోయిన డాక్టర్లు..
Glass In Old Man's Stomach
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 05, 2022 | 3:14 PM

మధ్యప్రదేశ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వృద్దుడు తీవ్రమైన కడుపునొప్పితో స్థానిక జిల్లా ఆసుపత్రికి చేరాడు. అక్కడున్న డాక్టర్లు అతడ్ని పరీక్షించి.. కొన్ని టెస్టులు చేశారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్‌ చెక్ చేయగా.. డాక్టర్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అతడి పొట్టలో ఓ గ్లాస్ ఉన్నట్లు ఎక్స్‌రేలో గుర్తించారు. ఇంతకీ అసలు ఆ వృద్దుడి కడుపులోకి గ్లాస్ ఎలా వెళ్లింది.? ఏమైందన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌గర్హ జిల్లాలోని అమావత్ గ్రామానికి చెందిన రామ్‌దాస్ అనే వ్యక్తిని.. వృద్దుడని కూడా కనికరం లేకుండా కొందరు వ్యక్తులు కొట్టారు. ఆ తర్వాత అతడ్ని ఓ గ్లాస్‌పై కూర్చోపెట్టారు. దీంతో అది కాస్తా కడుపులోకి వెళ్ళిపోయింది. ఈ అవమానీయ ఘటన జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా.. సిగ్గుతో రామ్‌దాస్ అసలు విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. అంతవరకూ కూడా నొప్పితోనే బాధపడుతూ వచ్చాడు. అయితే ఈ మధ్య ఆ నొప్పి కాస్తా తీవ్రతరం కావడంతో సమాచారాన్ని గ్రామస్థులకు అందించాడు. వారు అతడ్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఇక జిల్లా ఆసుపత్రిలోని వైద్యులు ఆపరేషన్ చేసి అతడి కడుపులోని గ్లాస్‌ను బయటికి తీశారు. ప్రస్తుతం వృద్దుడి ఆరోగ్యం కుదుటపడిందని డాక్టర్లు చెప్పారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు వృద్దుడి వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..