Bank Special Offer: ఈ ప్రభుత్వ బ్యాంకు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఆఫర్‌.. అదనపు ప్రయోజనాలు

ప్రస్తుతం బ్యాంకుల్లో వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేవారు మంచి వడ్డీ రేటును పొందవచ్చు. అలాగే సీనియర్‌ సిటిజన్లకు కూడా మంచి..

Bank Special Offer: ఈ ప్రభుత్వ బ్యాంకు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఆఫర్‌.. అదనపు ప్రయోజనాలు
Bank Special FD Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Oct 06, 2022 | 4:20 PM

ప్రస్తుతం బ్యాంకుల్లో వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేవారు మంచి వడ్డీ రేటును పొందవచ్చు. అలాగే సీనియర్‌ సిటిజన్లకు కూడా మంచి ఆఫర్ అందుబాటులో ఉంటున్నాయి.ఇక తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డిని అదనంగా 80 బేసిస్ పాయింట్లు అంటే 0.80 శాతం పెంచింది. ఈ అదనపు వడ్డీ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీలపై ఇవ్వబడుతుంది. బ్యాంక్ సాధారణంగా 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును ఇస్తుంది. అంటే 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లకు సాధారణ ప్రజల ఎఫ్‌డీల కంటే 0.50 శాతం. ఇతర బ్యాంకులతో పోలిస్తే ప్రస్తుతం 80 ఏళ్ల సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్న మొట్టమొదటి ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు.

పీఎన్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం.. 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్‌లు అన్ని మెచ్యూరిటీ బ్రాకెట్‌లలో వర్తించే వడ్డీ రేటుపై 80 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీని పొందుతారని పేర్కొంది. రిటైర్డ్ స్టాఫ్ సభ్యుల విషయంలో సిబ్బంది సభ్యులతో పాటు సూపర్ సీనియర్ సిటిజన్లకు కూడా అదే రేటు వర్తిస్తుంది. వారు 80 బేసిస్ పాయింట్ల ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ప్రస్తుతం ఏ బ్యాంకు కూడా తన సూపర్ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అన్ని పదవీకాలానికి అంత ఎక్కువ వడ్డీని చెల్లించడం లేదు.

మీరు సీనియర్ సిటిజన్స్ కేటగిరీ కిందకు వచ్చి పీఎన్‌బీ ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే దీని కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లు ఇటీవల కొన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచారు. సీనియర్ సిటిజన్‌ల కోసం నిర్దిష్ట కాలవ్యవధి ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై, సూపర్ సీనియర్ సిటిజన్‌ల కోసం అన్ని అవధుల ఎఫ్‌డీ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచినట్లు బ్యాంక్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

వడ్డీ రేటు ఎంతో తెలుసా?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5 నుంచి 10 ఏళ్ల ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటును 6.15 శాతం నుంచి 6.45 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన ఏదైనా దేశీయ డిపాజిట్ ఎఫ్‌డీలపై వర్తించే రేట్ల వద్ద అదనంగా 0.50 శాతం వడ్డీని పొందుతారు. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుండి 1111 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపైలపై 3.80 శాతం నుండి 6.55 శాతం వడ్డీని పొందుతారు. దీనిపై, 0.80 శాతం అదనపు వడ్డీ ప్రయోజనం లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి