MY HOME TARKSHYA: మైహోమ్ ప్రాజెక్ట్‌కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం.. తర‌క్ష్యను వరించిన క్వాలిటీ ప్లాటినం అవార్డ్..

తరతరాలపాటు తలెత్తుకుని జీవించేలా..ఇల్లాలి ముఖంలో చెరగని చిరునవ్వులా.. నిర్మాణరంగంలో 36 ఏళ్లుగా నమ్మకానికి ప్రతిరూపంగా నిలిచిన మై హోమ్‌‌కు మరో అవార్డ్ వరించింది.

MY HOME TARKSHYA: మైహోమ్ ప్రాజెక్ట్‌కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం.. తర‌క్ష్యను వరించిన క్వాలిటీ ప్లాటినం అవార్డ్..
Hyderabad Real Estate (Representative Image)
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 06, 2022 | 1:33 PM

మైహోమ్ గ్రూప్‌కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ‘మైహోమ్ తర‌క్ష్య ప్రాజెక్ట్‌కి’ బెస్ట్‌ క్వాలిటీ అవార్డ్ దక్కింది. ఢిల్లీలోని జన్‌పథ్‌లో ఉన్న అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఈ అవార్డ్‌ సెర్మనీ జరుగుతోంది. మైహోమ్ గ్రూప్ తరఫున సీనియర్ మేనేజ్‌మెంట్‌ టీమ్ ఈ అవార్డ్‌ను అందుకున్నారు. కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ చేతుల మీదుగా అవార్డ్‌ను స్వీకరించారు. 14th QCI-DL షా క్వాలిటీ ప్లాటినం అవార్డ్-సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా ఈ అవార్డ్స్ ప్రదానం జరుగుతోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని.. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మైహోమ్ గ్రూప్‌కి ఈ అవార్డు దక్కింది.

మైహోమ్‌ అంటే గృహాలనిర్మాణాలే కాదు.. కస్టమర్ల దగ్గర నమ్మకాన్ని కూడా నిర్మించామంది సంస్థ. అందుకే ఈ ప్రతిష్టాత్మక పురస్కారంను సొంతం చేసుకుంది.

మైహోమ్ తర‌క్ష్య ప్రాజెక్ట్‌కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి