Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Second Hand Phone: మీరు సెకండ్‌ హ్యాండ్‌ మొబైల్‌ను కొంటున్నారా..? అది ఒరిజినలా..? కదా తెలుసుకోవడం ఎలా?

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ ఫోన్లు పోగొట్టుకున్నవారు చాలా మందే ఉంటున్నారు. చోరీ చేసేవాళ్లు సదరు వ్యక్తికి తెలియకుండానే జేబులోంచి..

Second Hand Phone: మీరు సెకండ్‌ హ్యాండ్‌ మొబైల్‌ను కొంటున్నారా..? అది ఒరిజినలా..? కదా తెలుసుకోవడం ఎలా?
Second Hand Phone
Follow us
Subhash Goud

|

Updated on: Oct 05, 2022 | 4:38 PM

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ ఫోన్లు పోగొట్టుకున్నవారు చాలా మందే ఉంటున్నారు. చోరీ చేసేవాళ్లు సదరు వ్యక్తికి తెలియకుండానే జేబులోంచి ఫోన్‌లో కొట్టేస్తున్నారు. అయితే చోరీ చేసిన ఫోన్‌ను తర్వాత దాని కోడ్స్‌, ఇతర నంబర్లను మార్చేసి మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇలా సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఓరిజినలా? కాదా ? అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవడం మంచిది. ఇకపోతే ఇబ్బందులు వస్తాయి. ఒకసారి వాడిన స్మార్ట్‌ఫోన్‌ మళ్లి కొంటే అన్ని వివరాలు చెక్‌ చేసుకోవడం మంచిదని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఎవరి వద్దనైనా సెకండ్‌ హ్యండ్‌ ఫోన్‌ కొనే ముందు జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలి. ఏం ఆలోచించకుండా కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే మీరు కొనుగోలు చేసే ఫోన్‌ అది మంచిదా..? కాదా, ఒరిజినలేనా.. అనే విషయాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

దీంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్‌లను ట్రాక్‌ చేసేందుకు సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోర్టల్‌ ద్వారా ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకు అవకాశం ఉంటుంది. ఈ పోర్టల్‌ ద్వారా మీరు సెకండ్‌ హ్యండ్‌ కొనుగోలు చేసే మొబైల్‌ ఒరిజినలా? కదా అనే విషయాన్ని సులభంగా గుర్తించవచ్చంటున్నారు టెక్‌ నిపుణులు.

తెలుసుకోవడం ఎలా..?

ఇవి కూడా చదవండి

మీరు ముందుగా CEIR అనే పోర్టల్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత అక్కడ మైన్‌ పేజ్‌లో అప్లికేషన్‌లోకి వెళ్లి అక్కడ Know Your Mobile App, లేదా IMEI Verification అనే రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వీటిలో IMEI Verificationను ఎంచుకోండి. తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌ను నమోదు చేయండి. తర్వాత మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి. తర్వాత ఐఎంఈఐ సూచించిన కాలంలో ఇమెయిజ్‌ నెంబర్‌ను నమోదు చేయాలి. ఒకవేళ మీరు తీసుకున్న మొబైల్‌ IMEI నెంబర్‌ తెలియకపోతే మొబైల్‌లో *#06# ప్రెస్‌ చేస్తే మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు ఐఎంఈఐ నెంబర్‌ను నమోదు చేసి సబ్మిట్‌పై నొక్కాలి. వెంటనే వివరాలు వస్తాయి. ఇలా తెలుసుకోవడం వల్ల మీరు కొనుగోలు చేసిన సెకండ్‌ హ్యండ్‌ ఫోన్‌ అది ఒరిజినలా..? లేదా..? అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే దొంగిలించిన ఫోన్లు చాలా మంది అమ్మేసుకుంటారు. అందుకే ముందు ఇలా చెక్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే దొంగిలించబడిన ఫోన్‌పై ఎవరైనా పోలీసు కేసు నమోదు చేసినట్లయితే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి