Fake Currency Notes: రూ.317 కోట్ల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం.. పోలీసుల విచారణలో షాకింగ్‌ విషయాలు

నకిలీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల కళ్లుగప్పి నకిలీ నోట్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. తాజాగా గుజరాత్‌లో భారీ ఎత్తున నకిలీ..

Fake Currency Notes: రూ.317 కోట్ల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం.. పోలీసుల విచారణలో షాకింగ్‌ విషయాలు
Fake Currency Notes
Follow us
Subhash Goud

|

Updated on: Oct 05, 2022 | 3:45 PM

నకిలీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల కళ్లుగప్పి నకిలీ నోట్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. తాజాగా గుజరాత్‌లో భారీ ఎత్తున నకిలీ నోట్లు బయటపడ్డాయి. సూరత్‌లో అంబులెన్స్‌లో లక్షలాది రూపాయల నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. నకిలీ నోట్ల మొత్తం రూ.317 కోట్లుగా చెబుతున్నారు. ఐదు రోజుల క్రితం ఇదే కేసులో పోలీసులు అంబులెన్స్‌లో ఉంచిన 6 బాక్సుల్లో 25 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ నకిలీ నోట్ల విలువ రూ.317 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. సూరత్‌లోని కమ్రెజ్ పోలీసులు హైవేపై దిక్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ అంబులెన్స్‌ను ఆపారు. ఈ అంబులెన్స్ అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తోంది. అనుమానం వచ్చి అంబులెన్స్‌లో తనిఖీ చేయగా అందులో నుంచి 6 పెట్టెల నకిలీ నోట్లు లభ్యమయ్యాయి. ఈ నోట్ల విలువ 25 కోట్ల నకిలీ నోట్ల విలువ రూ.316 కోట్ల 98 లక్షలు అని పోలీసులు తెలిపారు. ఈ నకిలీ నోట్ల కేసులో ప్రధాన సూత్రధారి వికాస్ జైన్ అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అంబులెన్స్‌లో నకిలీ నోట్లను తీసుకెళ్తున్నట్లు సూరత్ పోలీసులకు ఇన్‌ఫార్మర్ నుంచి సమాచారం అందింది. దీని తర్వాత కమ్రెజ్ పోలీసులు అంబులెన్స్‌ను అడ్డగించి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ నోట్ల వ్యాపారం ఇలా సాగేది..

నకిలీ నోట్లు దొరికిన అంబులెన్స్ దిక్రి ఎడ్యుకేషన్ ట్రస్టుకు చెందినది. అంబులెన్స్ డ్రైవర్‌ హితేష్‌ పురుషోత్తం భాయ్‌ కొటాడియాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి నుంచి రూ.52 కోట్ల నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌కు సూత్రధారి ముంబైలో నివసించే వికాస్ జైన్ అని విచారణలో హితేష్ పోలీసులకు చెప్పాడు. వికాస్ జైన్ ముంబై నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్ అంగడియా కంపెనీకి యజమాని. డ్రైవర్ హితేష్ అరెస్టు తర్వాత, అనేక రహస్యాలు బయటపడ్డాయి. ఆ తర్వాత ఇతర నిందితులను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

నకిలీ నోట్ల ఫిల్మ్ కనెక్షన్

ట్రస్ట్‌కు విరాళం ఇవ్వడానికి వికాస్ జైన్ ఎవరితోనైనా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, విరాళం మొత్తంలో పది శాతం అడ్వాన్స్ బుకింగ్‌గా తీసుకునేవాడని ఈ విషయాన్ని విచారిస్తున్నట్లు ఎస్పీ హితేష్ జోయ్‌సర్ వెల్లడించారు. రాజ్‌కోట్‌కు చెందిన ఓ వ్యాపారిని జైన్‌ ముఠా కోటి రూపాయలకు పైగా మోసం చేసింది. అంబులెన్స్‌లో దొరికిన నకిలీ నోట్లు సినిమా షూటింగ్‌లకు వినియోగించిన డబ్బు అని అంబులెన్స్ డ్రైవర్ హితేష్ పోలీసులకు తెలిపాడు. వికాస్ జైన్‌కు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కార్యాలయాలు ఉన్నాయి. నకిలీ నోట్లను బుక్ చేసే పేరుతో లక్షల రూపాయలను రికవరీ చేశాడు. వికాస్ జైన్ తన మొత్తం నెట్‌వర్క్‌ను గుజరాత్‌లోనే కాకుండా ముంబై, ఢిల్లీ, ఇండోర్, బెంగుళూరులో కూడా నడిపిస్తున్నాడు.

నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ బదులు రివర్స్‌ బ్యాంకు

నిజానికి సూరత్‌లో పట్టుబడిన నకిలీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్‌కు బదులుగా రివర్స్ బ్యాంక్ అని రాసి ఉంది. విశేషమేమిటంటే ఆ నోటుపై ‘ఫర్ మూవీ పర్పస్’ అని రాసి ఉంది. అంటే ఈ నోట్లను సినిమాల్లో ఉపయోగించాలని. అరెస్టయిన నిందితులకు వికాస్ జైన్ నకిలీ నోట్లను సరఫరా చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. జైన్ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీలో కొరియర్ కార్యాలయాన్ని నడిపేవారు. జైన్ ఉత్తర భారతదేశంలోని వివిధ నగరాల్లో నకిలీ నోట్లను ముద్రించి కొరియర్ సర్వీస్ ద్వారా ముంబైకి సరఫరా చేసేవాడు. నకిలీ నోట్లను నిల్వ చేసేందుకు ముంబైలో గోడౌన్ కూడా నిర్మించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి