IRCTC Account: రైలు టికెట్ల బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ ఖాతాను సృష్టించడం ఎలా..? ఇలా చేయండి

చాలా మంది రైలు ప్రయాణం అంటే ఎంతో ఆష్టపడుతుంటారు. రైళ్లు కాస్త లేటుగా ఉన్నా.. సామాన్యులు సైతం భారీగా ప్రయాణాలు చేస్తుంటారు. తక్కువ ధరల్లో టికెట్లు ఉండటంతో సామాన్యుడు సైతం రైలు..

IRCTC Account: రైలు టికెట్ల బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ ఖాతాను సృష్టించడం ఎలా..? ఇలా చేయండి
Irctc Account
Follow us

|

Updated on: Oct 04, 2022 | 9:48 PM

చాలా మంది రైలు ప్రయాణం అంటే ఎంతో ఆష్టపడుతుంటారు. రైళ్లు కాస్త లేటుగా ఉన్నా.. సామాన్యులు సైతం భారీగా ప్రయాణాలు చేస్తుంటారు. తక్కువ ధరల్లో టికెట్లు ఉండటంతో సామాన్యుడు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటాడు. ఇక రైలు టికెట్లను ముందుగానే బుకింగ్‌ చేసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ ఉండనే ఉంది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ప్రతి రోజు లక్షలాది మంది రైలు టికెట్లను బుక్‌ చేసుకుంటారు. దీంతో సులభంగా రైలు ప్రయాణం చేయవచ్చు. టికెట్ల బుకింగ్‌ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా సీట్లో కూర్చోని హాయిగా ప్రయాణం సాగించవచ్చు. అయితే రైలు టికెట్లు బుకింగ్‌ చేసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ అకౌంట్ తప్పనిసరి. ఈ అకౌంట్ల క్రియేట్‌ చేసుకోవాలంటే ఆధార్‌ వివరాలతో పాటు మొబైల్‌ నెంబర్‌, ఇతర వివరాలు తప్పనిసరి.

గతంలో కరోనా ఉన్నందున రైలు ప్రయాణాలు చేయడం నిలిపివేసిన ప్రజలు.. తర్వాత జోరందుకున్నాయి. ఇక పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వే శాఖ. అయితే చాలా మంది రైలు టికెట్ బుక్ చేసుకునే విషయంలో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే, రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణికులు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వెబ్ సైట్, యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఖాతా లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. సొంతంగా ఖాతా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి గతంలో ఐఆర్‌సీటీసీ తన ట్విటర్ ద్వారా వీడియో షేర్ చేసింది.

ఐఆర్‌సీటీసీ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా..?

► ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి.

► అందులో మీకు కనిపించే రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

► మీ యూజర్ నేమ్ నమోదు చేయండి

► ఇప్పుడు ఒకే పాస్‌వర్డ్‌ను రెండు బాక్స్‌లలో నమోదు చేసిన తర్వాత మీ భాషను ఎంచుకోండి.

► భద్రతా ప్రశ్న ఎంచుకొని దాని కింద మీ సమాధానాన్ని ఎంటర్ చేయండి.

► ఆ తర్వాత మీ పేరు, లింగం, వృత్తి, పుట్టిన తేదీ వంటి ఇతర వివరాలు నమోదు చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి.

► తర్వాత మెయిల్ ఐడీ, మొబైల్ నెంబరును ఎంటర్ చేయండి.

► ఆ తర్వాత పిన్ కోడ్‌తో సహా మీ పూర్తి చిరునామాను నమోదు చేయండి.

► మీ రిజిస్టర్డ్ నెంబరు/ఈమెయిల్ ఐడీకి పంపిన కోడ్ నమోదు చేసి రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ క్రియేట్ అవుతుంది.

ఈ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవడం ద్వారా రైలు టికెట్లను సులభంగా బుకింగ్‌ చేసుకోవచ్చు. లేకపోతే ఇతరుల ఖాతా నుంచి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్‌ లేకపోతే రైలు టికెట్లు బుకింగ్‌లో ఇబ్బందులు తలెత్తవచ్చు. సొంత అకౌంట్‌ క్రియేట్‌ చేసుకుని రైలు ప్రయాణం చేసే ముందు టికెట్లును బుకింగ్‌ చేసుకోవడంలో సులభమైన ప్రయాణాన్ని అనుభవించవచ్చు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు