Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp Banking Service: ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌ ద్వారా కొత్త సేవలు..

బ్యాంకులు తమ కస్టమర్లకు కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో పలు రకాల సర్వీసులను..

Whatsapp Banking Service: ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌ ద్వారా కొత్త సేవలు..
Whatsapp Banking Service
Follow us
Subhash Goud

|

Updated on: Oct 04, 2022 | 4:13 PM

బ్యాంకులు తమ కస్టమర్లకు కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో పలు రకాల సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కూడా తన కస్టమర్లకు కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. పీఎన్‌బీకి చెందిన వాట్సాప్‌ బ్యాంకింగ్ సేవను తీసుకువచ్చింది. ఎందుకంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెరుగైన సౌకర్యాలను అందించే లక్ష్యంతో వాట్సాప్‌ బ్యాంకింగ్ సేవను ప్రారంభించింది. కస్టమర్లకు ఈ విషయాన్ని బ్యాంకు సోమవారం ప్రకటించింది. ఈ సదుపాయం బ్యాంక్ కస్టమర్లు, నాన్-కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇప్పుడు మీరు ఏ బ్యాంకు సంబంధిత పని కోసం బ్రాంచ్‌కి వెళ్లవలసిన అవసరం లేదు. మీరు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో కూర్చున్న మీకు కొన్ని నిమిషాల్లోనే వాట్సాప్‌లో బ్యాంకుకు సంబంధించిన మొత్తం సమాచారం తెలుసుకునే సౌలభ్యం ఉంది. కస్టమర్ల సేవలు మరింతగా మెరుగు పర్చేందుకు బ్యాంకు ఈ సేవలను ప్రారంభించింది.

మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే వాట్సాప్‌లో బ్యాంకింగ్ సేవను సక్రియం చేయడానికి వినియోగదారులు తమ మొబైల్‌లో పీఎన్‌బీ అధికారిక వాట్సాప్ నంబర్ 9264092640ని సేవ్ చేసి, ఈ నంబర్‌కు హలో అని పంపడం ద్వారా సంభాషణను ప్రారంభించాలి. అయితే, సంభాషణను ప్రారంభించే ముందు వినియోగదారులు వాట్సాప్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ప్రొఫైల్ పేరులో ‘గ్రీన్ టిక్’ ఉందో లేదో తనిఖీ చేయాలని బ్యాంక్ చెబుతోంది.

వాట్సాప్ బ్యాంకింగ్‌లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు చెందిన వాట్సాప్ బ్యాంకింగ్ సేవను సద్వినియోగం చేసుకునే వారు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఇందులో అనేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా ఆర్థికేతర బ్యాంకింగ్ సేవలను అందిస్తుందని పేర్కొంది. ఖాతాదారుల కోసం చివరి 5 లావాదేవీ వివరాలు, బ్యాలెన్స్ విచారణ, చెక్ స్టాప్, చెక్ రిక్వెస్ట్ వంటివి అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఇది కాకుండా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తన ఖాతాదారులకు వాట్సాప్‌ బ్యాంకింగ్ ద్వారా కొన్ని సౌకర్యాలను అందిస్తుంది. దీనిలో బ్యాంక్ తన ఖాతాదారులు, ఖాతా లేనివారు ఆన్‌లైన్ ఖాతాలు, బ్యాంక్ డిపాజిట్లు లేదా రుణ ఉత్పత్తులను తెరవడానికి డిజిటల్ ఉత్పత్తులు, శాఖలను తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది. ఈ సౌకర్యాలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కస్టమర్లకు 24 గంటల్లో అందుబాటులో ఉంటాయి.

ఏడు రోజుల పాటు 24 గంటల సేవ అందుబాటులో ..

వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ యొక్క ఈ సౌకర్యాలు 24 గంటలు, వారంలో ఏడు రోజులు తెరిచి ఉంటాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. ఇది కాకుండా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన వాట్సాప్‌ బ్యాంకింగ్ సేవ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైల్ ఫోన్‌లో కూడా అందుబాటులో ఉంటుందని బ్యాంకు తెలిపింది. వాట్సాప్‌ బ్యాంకింగ్ సేవ ద్వారా, మీరు ఇంట్లో కూర్చొని బ్యాంకుకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. దీని కోసం మీరు బ్యాంకు శాఖకు వెళ్లవలసిన అవసరం లేదు. దీని వల్ల బ్యాంకు వెళ్ల బాధ తప్పుతుంది. దీని వల్ల సమయం వృధా కాకుండా ఇంట్లో ఉండి సదుపాయాలను పొందవచ్చని తెలిపింది. ఇలా పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా కొత్త కొత్త సదుపాయలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కస్టమర్లకు మరింతగా చేరువయ్యేందుకు కొత్త సర్వీలను ప్రవేశపెడుతున్నాయి. దీని వల్ల వినియోగదారులు మెరుగైన సేవలు పొందుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి