- Telugu News Photo Gallery 7th pay commission hra hike likely after central government employees da hike house rent allowance
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ బహుమతులు బంపర్ ఆఫర్?
పండుగల సందర్భంగా కరువు భత్యాన్ని పెంచడం ద్వారా కేంద్ర ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. జులై 1, 2022 నుండి అమల్లోకి వచ్చేలా డియర్‌నెస్ అలవెన్స్ 34 శాతం నుండి 38 శాతానికి పెంచబడింది..
Updated on: Oct 04, 2022 | 3:01 PM

పండుగల సందర్భంగా కరువు భత్యాన్ని పెంచడం ద్వారా కేంద్ర ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. జులై 1, 2022 నుండి అమల్లోకి వచ్చేలా డియర్‌నెస్ అలవెన్స్ 34 శాతం నుండి 38 శాతానికి పెంచబడింది. అయితే కేంద్ర ఉద్యోగులకు మరో కానుక ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

డియర్‌నెస్ అలవెన్స్ తర్వాత ఇంటి అద్దె అలవెన్స్‌ను కూడా పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్న నగరాన్ని బట్టి వారికి ఇంటి అద్దె భత్యం ఇస్తున్నామని తెలిపింది.

ఇది మూడు వర్గాలుగా విభజించబడింది. ఉద్యోగులు వారి ప్రాథమిక వేతనంలో 27% చొప్పున ఇంటి అద్దె భత్యం పొందుతారు. వై కేటగిరీ ఉద్యోగులకు వారి ప్రాథమిక వేతనంలో 18 నుంచి 20 శాతం చొప్పున ఇంటి అద్దె భత్యం లభిస్తుంది. జెడ్ కేటగిరీ ఉద్యోగులకు 9 నుంచి 10 శాతం చొప్పున ఇంటి అద్దె భత్యం ఇస్తారు. ప్రాంతం, నగరాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం నిర్ణయించబడుతుంది.

కేంద్ర ఉద్యోగుల ఇంటి అద్దె భత్యాన్ని ప్రస్తుత స్థాయి నుంచి 3 నుంచి 4 శాతం పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతకుముందు సెప్టెంబర్ 28, 2022 న పండుగ సీజన్, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 34 శాతం నుండి 38 శాతానికి పెంచింది.

ఇది జూలై 1, 2022 నుండి ఫిబ్రవరి 2023 వరకు అమలు చేయబడింది. ఏడాదికి రూ.6591 కోట్లు, 2022-23లో జూలై నుంచి ఫిబ్రవరి వరకు రూ.4394.24 కోట్లు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం తన పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ కూడా పెంచింది.




