AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లోకి 12వ విడత పీఎం కిసాన్‌ డబ్బులు.. ఎప్పుడు అంటే..!

మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్‌..

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లోకి 12వ విడత పీఎం కిసాన్‌ డబ్బులు.. ఎప్పుడు అంటే..!
Pm Kisan
Subhash Goud
|

Updated on: Oct 02, 2022 | 9:10 PM

Share

మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ ఒకటి. ఈ స్కీమ్‌ ద్వారా రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున అందుకోవచ్చు. ఏడాదిలో రూ.2000 చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పటి వరకు రైతులకు 11వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 12వ విడత రానుంది. ఈ డబ్బులు సెప్టెంబర్‌ చివరి నాటికి వస్తాయని వార్తలు వచ్చినా.. కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తర్వాత అక్టోబర్‌ 2 రైతుల ఖాతాల్లో జమ అవుతాయని కూడా పుకార్లు వచ్చినా.. డబ్బులు జమ కాలేదు. ఇప్పుడు మరో విషయం వినిపిస్తోంది. 12వ విడత డబ్బులు అక్టోబర్‌ 10వ తేదీలోపు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏ తేదీన రైతు ఖాతాల్లో జమ చేస్తారనే విషయం ఇంకా కేంద్రం అధికారికంగా వెల్లడించలేదు.

మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సాయం చేసేందుకు 2019లో పీఎం కిసాన్‌ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కొన్ని ప్రత్యేక నంబర్లను కేటాయించింది. ఈ నంబర్‌ల ద్వారా రైతులు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. అయితే అగ్రికల్చర్‌ ఇండియా తన అధికారిక ట్వీట్‌లో దేశంలోని రైతులు పీఎం కిసాన్‌ యోజన స్కీమ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ఓ నంబర్‌ను ఏర్పాటు చేసింది. దరఖాస్తు చేసుకున్న రైతులు155261 నంబర్‌కు కాల్‌ చేయడం ద్వారా దరఖాస్తు స్థితితో పాటు ఇన్‌స్టాల్‌మెంట్‌ అప్‌డేట్‌ గురించి తెలుసుకోవచ్చు.

ఖాతాలో తనిఖీ చేసుకోండిలా..

ఇవి కూడా చదవండి

☛ ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లాలి

☛ దీని తర్వాత మీరు కుడి వైపున ‘ఫార్మర్స్ కార్నర్’ ఎంపికను చేసుకోవాలి.

☛ మీరు ‘బెనిఫిషియరీ స్టేటస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

☛ ఇక్కడ కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

☛ ఇప్పుడు మీరు మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నుండి ఏదైనా ఒక ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత డేటాపై క్లిక్‌ చేస్తే వివరాలు వస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!