Real Estate: రియల్ ఎస్టేట్ రంగానికి శుభవార్త.. ఈ ఏడాది భారీగా పెరిగిన ఇళ్ల విక్రయాలు

ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 87 శాతం పెరిగి 2,72,709 యూనిట్లకు చేరుకున్నాయి. Anarock నివేదిక ప్రకారం..

Real Estate: రియల్ ఎస్టేట్ రంగానికి శుభవార్త.. ఈ ఏడాది భారీగా పెరిగిన ఇళ్ల విక్రయాలు
Real Estate
Follow us

|

Updated on: Oct 02, 2022 | 4:45 PM

ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 87 శాతం పెరిగి 2,72,709 యూనిట్లకు చేరుకున్నాయి. Anarock నివేదిక ప్రకారం.. అధిక డిమాండ్‌తో ఈ కాలంలో నివాసాల అమ్మకాలు కోవిడ్-19 ప్రారంభానికి ముందు 2019 సంవత్సరంలో జరిగిన మొత్తం అమ్మకాల కంటే ఎక్కువగా ఉన్నాయి. 2021 జనవరి-సెప్టెంబర్ కాలంలో గృహ విక్రయాలు 1,45,651 యూనిట్లుగా ఉన్నాయి. ప్రాపర్టీ అడ్వైజరీ అనరాక్ ప్రముఖ హౌసింగ్ బ్రోకరేజ్ కంపెనీలలో ఒకటి.

2019తో పోలిస్తే అమ్మకాలు పెరిగాయి:

దేశంలోని ఏడు ప్రధాన నగరాలు అంటే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎఆర్‌), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పూణేలలో ప్రాథమిక విక్రయాలను కంపెనీ పర్యవేక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఏడు నగరాల్లోని ఇళ్ల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంలో 1,45,651 యూనిట్ల నుంచి ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో 2,72,709 యూనిట్లకు పెరిగాయి. ఈ క్యాలెండర్ సంవత్సరంలో జనవరి-సెప్టెంబర్ సంఖ్య మొత్తం 2019లో విక్రయించిన 2,61,358 యూనిట్ల కంటే ఎక్కువగా ఉంది. అదే సమయంలో కరోనా మహమ్మారి తో లాక్‌డౌన్‌ కారణంగా, 2020 సంవత్సరంలో ఇళ్ల విక్రయాలు 1,38,344 యూనిట్లకు తగ్గాయి.

కొన్ని రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ తగ్గింపు ప్రయోజనం:

నివేదికల ప్రకారం.. గత సంవత్సరం తక్కువ స్టాంప్ డ్యూటీ రూపంలో మహారాష్ట్రతో సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రోత్సాహకాల కారణంగా భారతదేశ ప్రాథమిక గృహాల మార్కెట్ మెరుగుపడింది. ఈ కారణాల వల్ల 2021 సంవత్సరంలో ఇళ్ల విక్రయాలు 2,36,516 యూనిట్లకు పెరిగాయి. ఈ సంవత్సరం అది ఊపందుకుంది. అనరాక్ డేటా ప్రకారం.. జనవరి-సెప్టెంబర్‌లో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాలు రెండింతలు పెరిగి 49,138 యూనిట్లకు చేరుకున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 22,478 యూనిట్లుగా ఉంది. ఇది కాకుండా, MMR అమ్మకాలు 67 శాతం పెరిగి 48,716 యూనిట్ల నుండి 81,315 యూనిట్లకు చేరుకున్నాయి.

అదే సమయంలో హౌసింగ్ బ్రోకరేజ్ కంపెనీ PropTiger.com నివేదిక ప్రకారం.. ఆస్తి ధరలు, వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంది. అలాగే ఆస్తికి డిమాండ్ కరోనా కంటే ముందు స్థాయికి పెరిగింది. జూలై-సెప్టెంబర్ కాలంలో ఈ ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 49 శాతం పెరిగి 83,220 యూనిట్లకు చేరుకున్నాయని నివేదిక పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి