Vande Bharat Express: ప్రయాణికులకు అందుబాటులో ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలు.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..!

రైలు ప్రయాణం అనేది మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. తక్కువ ధరల్లో సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటుంది. ఇక గాంధీనగర్- ముంబై మధ్య నడుస్తున్న సెమీ-హై..

Vande Bharat Express: ప్రయాణికులకు అందుబాటులో 'వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌' రైలు.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..!
Vande Bharat Express
Follow us
Subhash Goud

|

Updated on: Oct 02, 2022 | 3:05 PM

రైలు ప్రయాణం అనేది మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. తక్కువ ధరల్లో సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటుంది. ఇక గాంధీనగర్- ముంబై మధ్య నడుస్తున్న సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన కొత్త, మెరుగైన వెర్షన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించారు. వందేభారత్ రైలులో కూడా ప్రయాణించిన ప్రధాని.. దేశంలోని నగరాలు భారతదేశ భవిష్యత్తును రూపొందిస్తాయని, రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారేలా చూస్తాయని అన్నారు. నిజానికి ఈ రైలు మహారాష్ట్ర, గుజరాత్ రాజధానులను కలుపుతూ వందే భారత్ రైళ్ల శ్రేణిలో మూడవ రైలు.

ఈ వందే భారత్ రైలు సిరీస్‌లో మొదటి రైలు న్యూఢిల్లీ, వారణాసి మధ్య ప్రారంభించబడింది. రెండవ రైలు న్యూ ఢిల్లీ నుండి మాతా వైష్ణో దేవి, కత్రా నుండి ప్రారంభించబడింది. ఇప్పుడు దాని మూడవ రైలు గుజరాత్ రాజధాని గాంధీనగర్ నుండి అహ్మదాబాద్, సూరత్, వడోదర మీదుగా ముంబైకి వెళ్తుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గేమ్ ఛేంజర్ అని నిరూపిస్తుందని, భారతదేశంలోని రెండు వ్యాపార కేంద్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతుందని పీఎంఓ తెలిపింది.

ఈ రైలులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రైలు ప్రయాణీకులకు మెరుగైన, విమాన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని, ఇందులో ఆర్మర్ టెక్నాలజీతో పాటు ఆధునిక భద్రతా చర్యలు ఉన్నాయని రైల్వే తెలిపింది. స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన ఈ రైలులో యాంటీ-కొలిజన్ సిస్టమ్- కవాచ్‌తో సహా అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయని వెల్లడించింది. రైలులో ప్రయాణిస్తుంటే ఒక రకమైన అనుభూతిని పొందవచ్చని, ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేలా ఈ రైలును రూపొందించినట్లు రైల్వే తెలిపింది. ఇతర రైళ్ల కంటే ఈ రైలులో అత్యాధునిక ఫీచర్స్‌ను రూపొందించినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది గాంధీనగర్-ముంబై వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 1 నుండి సాధారణ ప్రజల కోసం అందుబాటులో వచ్చింది. ఇది ఆదివారం మినహా వారానికి ఆరు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ముంబై సెంట్రల్ స్టేషన్ నుండి ఉదయం 6.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీనగర్ చేరుకుంటుంది. ఈ రైలు గాంధీనగర్‌లో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి రాత్రి 8.35 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ సమయంలో రైలు సూరత్, వడోదర, అహ్మదాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి