Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌.. తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

మారిన ధరలతో ఆదివారం దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46, 500 వద్ద లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.50,730 పలుకుతోంది.

Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌.. తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Follow us
Basha Shek

|

Updated on: Oct 02, 2022 | 7:11 AM

బంగారం కొనేవారికి శుభవార్త. గత రెండు రోజులుగా పెరిగిన పసిడి ధరలు ఇవాళ (అక్టోబర్‌2) కాస్త దిగొచ్చాయి. 10 గ్రాముల బంగారంపై రూ.150 నుంచి రూ.170 వరకు తగ్గింది. మారిన ధరలతో ఆదివారం దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46, 500 వద్ద లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.50,730 పలుకుతోంది. ఇక ఇవాళ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గడంతో రూ. 56,900 గా ఉంది. మరి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం.

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.46,500గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.50,730 పలుకుతోంది.

☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 వద్ద ఉంది.

☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780పలుకుతోంది.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 పలుకుతోంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 వద్ద కొనసాగుతోంది.

☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.50,890 పలుకుతోంది.

☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.50,730కు లభిస్తోంది.

☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 వద్ద ఉంది.

బంగారం బాటలోనే వెండి..

సిల్వర్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్ తగిలింది. వెండి ధరలు బంగారం బాటలోనే దిగొచ్చాయి. ఈరోజు ఉదయం బులియన్‌ మార్కెట్లో కిలో రూ.100 తగ్గడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.62,000గా ఉంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరకు వెండి లభిస్తోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ. 56,900 పలుకుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..