Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. రూ.10 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.16 లక్షలు

కేంద్ర ప్రభుత్వం రాబడి వచ్చి రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. గతంలో కేవలం బ్యాంకులలో మాత్రమే పథకాలు ఉండగా, ఇప్పుడు పోస్టాఫీసుల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ..

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. రూ.10 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.16 లక్షలు
Post Office Scheme
Follow us

|

Updated on: Oct 04, 2022 | 4:40 PM

కేంద్ర ప్రభుత్వం రాబడి వచ్చి రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. గతంలో కేవలం బ్యాంకులలో మాత్రమే పథకాలు ఉండగా, ఇప్పుడు పోస్టాఫీసుల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందేందుకు వివిధ రకాల పథకాలు పోస్టాఫీసుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళిక కోసం ముందస్తుగా పోస్టాఫీసుల్లో ఉండే స్కీహలను ఎంచుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ చేసుకోవచ్చు. దీని వల్ల మెచ్యూరిటీ తర్వాత లక్షల్లో రాబడి అందుకోవచ్చు. అయితే పోస్టాఫీసుల్లో ఉండే పథకాలు ఎప్పుడూ సురక్షితమే. లాభాలు ఎక్కువగా ఉంటాయి. వడ్డీ రేట్లు కూడా అధికంగానే ఉంటాయి. కొన్ని స్కీమ్‌లో బ్యాంకుల కంటే పోస్టాఫీసుల్లోనే ఎక్కువ రాబడి వచ్చేవి ఉంటాయి. దీంతో కేంద్రం పోస్టాఫీసుల్లో అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ స్కీమ్‌లు సురక్షితంగా ఉండడమే కాకుండా ఎక్కువ రిటర్న్స్ పొందే అవకాశం దక్కుతుంది. ఈ పోస్టాఫీసులో ఉండే రికరింగ్ డిపాజిట్ పథకం కస్టమర్లకు మంచి లాభాలను తెచ్చి పెడుతోంది. అయితే పోస్టాఫీసులో ఉండే పథకాల్లో ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి బెనిఫిట్‌ పొందవచ్చని పోస్టల్‌ అధికారులు చెబుతున్నారు.

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం అనేది ఒక స్మాల్ సేవింగ్ స్కీమ్. ఇందులో ఎంత వీలైతే అంత డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందులో 1, 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం కోసం కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ప్రతి మూడు నెలలకు వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో వడ్డీ అనేది 5.8 శాతంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సేవింగ్ పథకాలపై వడ్డీని ప్రతి మూడు నెలలకోసారి జమ చేస్తుంది. ఈ పథకంలో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయడం ద్వారా లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. ఈ పథకం ద్వారా రుణ సదుపాయం కూడా ఉంటుంది. ఈ పథకంలో 12 వాయిదాలు జమ చేస్తే.. రుణం కూడా తీసుకోవచ్చు. ఈ అకౌంట్‌లో జమ చేసిన మొత్తంలో 50 శాతం రుణం తీసుకోవచ్చు.

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో నెలకు రూ.10వేల చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే 10 సంవత్సరాల అనంతరం మీరు రూ.16 లక్షల వరకు బెనిఫిట్‌ పొందవచ్చు. 10 సంవత్సరాల్లో మీరు జమ చేసేది 12 లక్షలు మాత్రమే. అయితే ఈ స్కీమ్‌ వ్యవధి పూర్తయిన తర్వాత 4 లక్షల 26 వేల 476 రూపాయలు అదనంగా పొందవచ్చు. ఈ విధంగా మీకు 10 సంవత్సరాల తర్వాత 16 లక్షల 26 వేల 476 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఇలా పోస్టాఫీసుల్లో ఉన్న స్కీమ్‌లను సద్వినియోగం చేసుకుంటే మంచి వడ్డీ రేటుతో పాటు మంచి రాబడి పొందే అవకాశం దక్కించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది పోస్టాఫీసులో ఉన్న పథకాలను ఎంచుకుంటున్నారు. మీ పిల్లల భవిష్యత్తు నిమిత్తం చదువు, ఇంటి నిర్మాణం తదితర పనుల కోసం ఈ డబ్బులును ఉపయోగించుకోవచ్చు. కాగా, ఇందులోని వివరాలన్ని వివిధ వెబ్‌సైట్లు, నిపుణుల ఆధారంగా అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే మీ సమీపంలో ఉండే పోస్టాఫీసును సంప్రదిస్తే సిబ్బంది వివరాలను అందజేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం