Jio True 5G: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. దసరా నుంచి ఈ నాలుగు నగరాల్లో జియో 5 జీ సేవలు

దేశంలో టెక్నాలజీ మరింగా పెరిగిపోతోంది. ఇప్పటి వరకు 4జీ టెక్నాలజీ మాత్రమే ఉండగా, ఇక నుంచి 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. దేశంలో 5నెట్‌ వర్క్‌ సేవలను ఇటీవల ప్రధాన నరేంద్ర మోడీ ఢిల్లీలో..

Jio True 5G: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. దసరా నుంచి  ఈ నాలుగు నగరాల్లో జియో 5 జీ సేవలు
Jio True 5g
Follow us
Subhash Goud

|

Updated on: Oct 04, 2022 | 7:17 PM

దేశంలో టెక్నాలజీ మరింగా పెరిగిపోతోంది. ఇప్పటి వరకు 4జీ టెక్నాలజీ మాత్రమే ఉండగా, ఇక నుంచి 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. దేశంలో 5నెట్‌ వర్క్‌ సేవలను ఇటీవల ప్రధాన నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభించిన విషయం తెలిసిందే. టెలికాం కంపెనీలైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు 5జీ టెక్నాలజీని తీసుకురాబోతున్నాయి. ఇప్పటికే ట్రయల్‌ రన్స్‌ ముగియగా, ఈ నెల 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ముందుగా కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించనున్నాయి. ఈ నేపథ్యంలో జియో తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదరు చూస్తున్న జియో 5జీ సేవలు రానే వస్తున్నాయి. ‘జియో వెల్‌కం ఆఫర్‌ అంటూ ఇన్విటేషన్‌ పంపించింది జియో. ఈ 5జీ సేవల బీటా పరీక్ష మాత్రమే కానీ.. వాణిజ్య ప్రయోగం కాదని తెలిపింది. ప్రయోగాత్మకంగా అందిస్తున్న తొలి దశలో 1 జీబీపీఎస్‌ వేగంతో అన్‌లిమిటెడ్‌ 5 జీ డాటాను కస్టమర్లు పొందుతారని రిలయన్స్‌ జియో స్పష్టం చేసింది. దసరా పండగ సందర్భంగా ప్రయోగాత్మకంగా నాలుగు నగరాల్లోనే టెలికాం కంపెనీ 5జీ ని అందుబాటులోకి తీసుకువస్తోంది జియో. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి నగరాల్లోని జియో కస్టమర్లకు బుధవారం నుంచి 5జీ సేవలను యాక్సెస్ చేయనున్నట్లు రిలయన్స్‌ జియో సంస్థ తెలిపింది. అయితే దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో జియో 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు జియో తెలిపింది. అయితే ఈ 5జీ సేవలు వినియోగించాలంటే ధరలు అధికంగా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటిదేమి ఉండదని జియో స్పష్టం చేస్తోంది. ముందుగా 4జీ ధరలకే 5జీ సర్వీసులను అందిస్తామని రిలయన్స్‌ జియో స్పష్టం చేస్తోంది.

ఈ సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ ఆకాష్ ఎం అంబానీ మాట్లాడుతూ.. భారతదేశం అంతటా 5G వేగవంతమైన రోల్-అవుట్‌ను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. తమ సేవలు అత్యంత వేగవంతంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భారతదేశం డిజిటల్ విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. అయితే ఎంపిక చేసిన నగరాల్లో నెట్‌వర్క్ కవరేజీ వరకు వినియోగదారులు ఈ బీటా ట్రయల్‌ని పొందుతారు. ప్రతి ఒక్కరికీ ఉత్తమ కవరేజీ అందిస్తాము. జియో వెల్‌కమ్ ఆఫర్ వినియోగదారులు జియో ట్రూ 5జీకి అప్‌గ్రేడ్ చేయబడతారు. వారి ప్రస్తుత జియో సిమ్‌, 5జీ హ్యాండ్‌సెట్‌ను మార్చాల్సిన అవసరం లేకుండా సేవలు పొందవచ్చని అన్నారు. జియో 5జీ హ్యాండ్‌సెట్‌లు పని చేసేలా చేయడానికి అన్ని హ్యాండ్‌సెట్ బ్రాండ్‌లతో కూడా పని చేస్తోందని, జియో ట్రూ 5G సేవలతో సజావుగా, కస్టమర్‌లు అత్యంత సమగ్రంగా ఉంటారు ఆయన స్పష్టం చేశారు. దసరా నుంచి ఈ జియో ట్రూ 5జీ వెల్‌కమ్ ఆఫర్ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. వినియోగదారులు గరిష్టంగా 1 Gbps+ వేగంతో అపరిమిత 5G డేటాను పొందుతారని వెల్లడించారు. ఇతర నగరాల కోసం బీటా ట్రయల్ సేవ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జియో ట్రూ 5జీ సేవలు నాలుగు నగరాల్లో వెల్‌కమ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. 5జీ టెక్నాలజీలో ఇంటర్నెట్‌ వేగంగా ఎక్కువగా ఉంటుందని, ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

అప్పటి వరకు కొత్త ధరలు ఉండవు:

ఇవి కూడా చదవండి

కాగా, తమ వినియోగదారులు 5జీ సేవల విలువను గుర్తించే వరకు ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని జియో తేల్చి చెబుతోంది. దేశంలోని 8 నగరాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ 5జీ సేవలు 4జీ కంటే పది రేట్లు వేగంగా ఉంటాయని టెలికాం కంపెనీలు చెబుతున్నాయి. 4జీతో పోలిస్తే అత్యంత వేగంగా 5జీ సేవలు ఉండనున్నాయి. ఈ 5జీ టెక్నాలజీ ద్వారా ఎంత పెద్ద వీడియో అయినా కొన్ని సెకన్లలో డౌన్‌లోడ్‌ కానున్నాయని చెబుతున్నాయి. అంతేకాదు ఈ 5జీ సేవలు మంచి నాణ్యతతో కూడి ఉంటాయని తెలుస్తోంది. ఇక ముకేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని జియో రూ.88,078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకోగా, ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి