AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL 5G: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!

దేశంలో 5 టెక్నాలజీ రాబోతోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో 5జీ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..

BSNL 5G: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!
Ashwini Vaishnaw
Subhash Goud
|

Updated on: Oct 04, 2022 | 9:26 PM

Share

దేశంలో 5 టెక్నాలజీ రాబోతోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో 5జీ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. తర్వాత దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు ఓ కీలక వార్త. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 15, 2023 నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. రాబోయే 2 సంవత్సరాలలో 25000 టెలికాం టవర్లను ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం త్వరలో సన్నాహాలు చేస్తోందని మంత్రి తెలిపారు. అలాగే కొత్త టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.36 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు.

ఢిల్లీలో 6వ ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కనెక్టివిటీని సవాలుగా అభివర్ణించారు. దాదాపు అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో రాష్ట్ర మంత్రులందరి సమావేశం జరిగింది. కనెక్టివిటీని మెరుగుపరచడానికి రాష్ట్రాలు భారీ లిఫ్టింగ్ చేయాల్సి ఉంటుందని అశ్విని వైష్ణవ్ అన్నారు.

8 నెలల వ్యవధిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి గతి శక్తి మాస్టర్ ప్లాన్‌లో చేరాయని, కలిసి పని చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి కొనియాడారు. భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)ని తిరిగి ఏర్పాటు చేయడం ద్వారా కనెక్టివిటీ సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందని సమావేశంలో విశ్వాస్‌ అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణ కోసం మా వద్ద రూ.1.64 లక్షల కోట్లు ఉన్నాయి. ఇది వారి మూలధన పెట్టుబడి అవసరాలు, సాంకేతికత అప్‌గ్రేడేషన్ అవసరాలను తీర్చడానికి సరిపోతుందని ఆయన చెప్పారు. వచ్చే 6 నెలల్లో దేశంలోని 200కి పైగా నగరాలు 5జీ సేవలను ప్రారంభిస్తామని, రాబోయే రెండేళ్లలో దేశంలో 80-90 శాతం మందికి 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేయనున్నామని అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ను మార్కెట్‌ స్థిరీకరణ శక్తిగా గుర్తించి టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌కు రూ.1,64,000 కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్