Sukanya Samriddhi Yojana: ఆడ పిల్లలకు వరం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌.. ఎస్‌బీఐలో ఖాతా ఎలా ఓపెన్‌ చేయాలి.. పూర్తి వివరాలు

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే స్కీమ్‌లో ప్రవేశపెడుతోంది. ఇప్పటికే చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి..

Sukanya Samriddhi Yojana: ఆడ పిల్లలకు వరం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌.. ఎస్‌బీఐలో ఖాతా ఎలా ఓపెన్‌ చేయాలి.. పూర్తి వివరాలు
Sukanya Samriddhi Yojana
Follow us

|

Updated on: Oct 05, 2022 | 5:32 PM

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే స్కీమ్‌లో ప్రవేశపెడుతోంది. ఇప్పటికే చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. సీనియర్‌ సిటిజన్స్‌, పెద్దలతో పాటు పిల్లలపై కూడా పథకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన పథకం ఒకటి. ఆడ పిల్లలున్న తల్లిదండ్రులు ఈ అకౌంట్‌ను తెరవవచ్చు. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేటు, పోస్టాఫీసుల్లోనూ ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లల పేరుపై ఈ అకౌంట్‌ను తీయవచ్చు. ఇందులో ప్రతి నెలా డబ్బు డిపాజిట్‌ చేస్తూ ఉండాలి. మెచ్యూరిటీపై ఒకేసారి మొత్తం తీసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరితో కుమార్తెల విద్య, వివాహం వంటి ముఖ్యమైన పని కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌పై ప్రభుత్వం ప్రతి మూడె నెలలకోసారి వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటుంది. ఈ స్కీమ్‌పై వడ్డీ రేట్లు పెంచవచ్చు.. లేదా తగ్గించవచ్చు.. అలాగే స్థిరంగా కొనసాగించవచ్చు. ఈ పథకంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో కూడా అందుబాటులో ఉంది. మరీ ఈ బ్యాంకులో ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ ఎలా తెవలో తెలుసుకుందాం.

  1. స్కీమ్ వివరాలు: ఈ పథకంలో డిపాజిట్లు ఖాతా తెరిచిన తేదీ నుండి గరిష్టంగా 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు చేయవచ్చు.
  2. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం రూ. 250 జమ చేయకపోతే, ఆ ఖాతా డిఫాల్ట్‌గా పరిగణించబడుతుంది.
  3. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తికాకముందే డిఫాల్ట్ ఖాతాను పునరుద్ధరించవచ్చు. దీని కోసం, ప్రతి డిఫాల్ట్ సంవత్సరానికి రూ. 50 డిఫాల్ట్‌ పెనాల్టీతో కనీసం రూ. 250 చెల్లించాలి.
  4. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద డిపాజిట్ చేసిన మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు.
  5. ఈ పథకంలో వచ్చే వడ్డీకి కూడా ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
  6.  పిల్లలకి 18 ఏళ్లు వచ్చే వరకు సంరక్షకుడు ఖాతాను నిర్వహిస్తాడు.
  7. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10వ తరగతి నుండి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఖాతాలో ఉపసంహరణ చేయవచ్చు.
  8. సుకన్య ఖాతాకు ఎవరెవరు అర్హులు: సుకన్య సమృద్ది యోజన ఖాతాకు ఒక సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద ఖాతాను తెరవవచ్చు. ఈ స్కీమ్‌ కింద దేశంలోని బాలికల పేరుతో ఒక పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది. కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ ఖాతాను తెరవవచ్చు. అయితే, కవలలు లేదా త్రిపాది పిల్లలు పుట్టినప్పుడు. సుకన్య సమృద్ది యోజన అకౌంట్‌లో అమ్మాయికి 18 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు జమ చేస్తూనే ఉండాలి. 21 ఏళ్లు నిండిన తర్వాత డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
  9. వడ్డీ రేట్లు..: ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 7.6 శాతం ఉంది. ఈ నిర్ణయం ప్రభుత్వ సెక్యూరిటీలపై అందుబాటులో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా తీసుకోబడుతుంది. ఈ స్కీమ్‌ను 2014లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఖాతా 21 సంవత్సరాల వయస్సులో మెచ్యూర్ అవుతుంది. ఈ పథకంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలు.
  10. అకౌంట్‌ తీసేందుకు కావాల్సిన పత్రాలు: ఈ పథకం ఫారమ్‌, లబ్దిదారుని జనన ధృవీకరణ పత్రం,  లబ్దిదారుని తల్లిదండ్రుల చిరునామా పత్రం, లబ్దిదారుని తల్లిదండ్రుల ఐడీ పత్రం,  ఆధార్, ఇతర పత్రాలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..