Lava 5G: అదిరిపోయే ఫీచర్లతో రూ. 10 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్! మీరూ ఓ లుక్కేయండి
ప్రస్తుతం పలు మెట్రోపాలిటన్ సిటీలలో ఈ సేవలు అందుబాటులోకి రాగా.. త్వరలోనే దేశమంతటా 5జీ టెక్నాలజీ విస్తరించనుంది.
దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు మెట్రోపాలిటన్ సిటీలలో ఈ సేవలు అందుబాటులోకి రాగా.. త్వరలోనే దేశమంతటా 5జీ టెక్నాలజీ విస్తరించనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడున్న కొన్ని మొబైల్ ఫోన్లలో ఈ 5జీ టెక్నాలజీ సపోర్ట్ చేయదన్న విషయం విదితమే. ఇందులో భాగంగా పలు మొబైల్ తయారీ కంపెనీలు 5జీ సేవలు అందించే స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్.. రూ. 10 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మరికొద్ది రోజుల్లో మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇటీవల న్యూఢిల్లీలోని జరిగిన ఓ ఈవెంట్‌లో ‘లావా బ్లాజ్ 5జీ’ మొబైల్‌ను ప్రదర్శించింది. 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఇది అత్యంత చౌకైనది కాగా.. దీపావళి నుంచి ప్రీ బుకింగ్స్ మొదలు కానున్నాయి. మరి ఈ ఫోన్ ఫీచర్ల సంగతి చూసుకుంటే..
- HD+ రిజల్యూషన్‌తో 6.5 ఇంచెస్ LCD స్క్రీన్
- మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్
- 8MP ఫ్రంట్ కెమెరా
- 50MP రియర్ కెమెరా
- 5000mAh బ్యాటరీ
- 4GB RAM, 128GB Internal Storage
- 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్లతో ఈ మొబైల్ ఫోన్ బ్లూ, గ్రీన్ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..