Bimbisara: ఇట్స్ అఫీషియల్.. ‘బింబిసార’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

బింబిసార సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపావళి కానుకగా..

Bimbisara: ఇట్స్ అఫీషియల్.. 'బింబిసార' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Bimbisara Movie
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 05, 2022 | 1:06 PM

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు వశిష్ఠ మల్లిడి తెరకెక్కించిన చిత్రం ‘బింబిసార’. త్రిగర్తలను పరిపాలించిన రాజైన బింబిసారుడు చుట్టూ ఈ చిత్ర కథాంశం తిరుగుతుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ఆగష్టు 5వ తేదీన విడుదలై.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన బింబిసార బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం కాకుండా.. సుమారు రూ. 75 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డబుల్ రోల్‌లో కనిపించడం విశేషం. అలాగే హిట్స్ లేని కళ్యాణ్ రామ్‌కు ఈ మూవీ మంచి విజయాన్ని అందించింది. ఇప్పటికే థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో బింబిసార మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ కీలక ప్రకటన వచ్చేసింది.

బింబిసార సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపావళి కానుకగా అక్టోబర్ 21 నుంచి బింబిసార మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వీకెండ్, ఆపై దీపావళి పండుగ కలిసి రావడంతో ఓటీటీలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన వ్యూస్ లభించే అవకాశం ఉంది. బింబిసార చిత్రంలో కేథరిన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లు‌ కాగా.. ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి ఎం.ఎం. కీరవాణీ సంగీతాన్ని అందించారు. అటు ‘బింబిసార’ హిట్ కావడంతో.. ఇప్పుడు ‘బింబిసార-2’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..