నీ ధైర్యానికి దండం సామీ.. బుసులు కొడుతోన్న కింగ్ కోబ్రాను క్షణాల్లో కంట్రోల్ చేసేశాడుగా

ఇంటర్నెట్‌లో చూసే వీడియోలలో కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి.. ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే..

నీ ధైర్యానికి దండం సామీ.. బుసులు కొడుతోన్న కింగ్ కోబ్రాను క్షణాల్లో కంట్రోల్ చేసేశాడుగా
Snake Video
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 05, 2022 | 5:28 PM

సోషల్ మీడియా ప్రపంచం అన్నది ఆశ్చర్యాలతో నిండినది. ఇక్కడ మనం ఎప్పుడూ ఊహించలేనివి చూస్తుంటాం. ఇక ఇంటర్నెట్‌లో చూసే వీడియోలలో కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి.. ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మిగిలినవి భయాన్ని కలిగిస్తాయి. ఆ కోవకు చెందినవే పాములకు సంబంధించిన వీడియోలు. చాలామందికి పాములంటే చచ్చేంత భయం. పామును చూస్తే చాలు.. దూరంగా పరుగులు పెడతారు. అయితే ఇక్కడొక యువకుడు అందుకు కొంచెం భిన్నంగా చేశాడు. ఓ భారీ సైజ్ కింగ్ కోబ్రాను అతడు చాకచక్యంగా పట్టుకున్నాడు.

వైరల్ వీడియో ప్రకారం.. జన సంచారం ఎక్కువగా ఉండే ఓ ప్రాంతంలో భారీ కింగ్ కోబ్రా తిష్ట వేసుకుని కూర్చోగా.. దాన్ని పట్టుకునేందుకు ఓ యువకుడు అక్కడికి వస్తాడు. అతడు ఎంతో తెలివిగా ఆ పామును కంట్రోల్ చేస్తాడు. మొదటిగా ఆ యువకుడు దాని తోక పట్టుకోగా.. విషసర్పం బుసలు కొడుతూ అతడిపైకి వచ్చింది. అయితే దాన్ని చాలా తెలివిగా శాంతింపజేస్తూ.. ఒక్క ఉదుటన నోటి దగ్గర పట్టుకుంటాడు. అంతే! ఇంకేముంది కింగ్ కోబ్రా ఆ యువకుడి కంట్రోల్‌లోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత అతడు దాన్ని దగ్గరలోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టాడు. కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..