AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: పండగ సీజన్‌లో బంగారానికి భారీ డిమాండ్‌.. ధరలు మరింతగా పెరగనున్నాయా..? నిపుణులేమంటున్నారు?

పండుగల సీజన్‌లో బంగారానికి భారీ డిమాండ్‌ ఉంటుంది. విదేశీ మార్కెట్ల సంకేతాల కారణంగా బంగారం ధరలు నేటికీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే మరోవైపు ఈరోజు వెండి..

Gold Price: పండగ సీజన్‌లో బంగారానికి భారీ డిమాండ్‌.. ధరలు మరింతగా పెరగనున్నాయా..? నిపుణులేమంటున్నారు?
Gold Price
Subhash Goud
|

Updated on: Oct 06, 2022 | 6:12 PM

Share

పండుగల సీజన్‌లో బంగారానికి భారీ డిమాండ్‌ ఉంటుంది. విదేశీ మార్కెట్ల సంకేతాల కారణంగా బంగారం ధరలు నేటికీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే మరోవైపు ఈరోజు వెండి కాస్త వెనక్కి తగ్గింది. గురువారం బంగారం ధరలు పెరుగుదలతో 10 గ్రాములకు 52 వేల స్థాయిని దాటాయి. పండగ సీజన్ తర్వాత పెళ్లిళ్ల సీజన్ లో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీని వల్ల పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధర 53 వేల స్థాయికి చేరుకోవచ్చంటున్నారు.

బంగారం, వెండి ధర ఎంత హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, ఈ రోజు ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.497 పెరిగి రూ.52,220కి చేరుకుంది. క్రితం సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.51,723 వద్ద ముగిసింది. మరోవైపు వెండి ధర రూ.80 తగ్గి రూ.61,605కి చేరుకుంది. క్రితం సెషన్‌లో వెండి 61,685 స్థాయి వద్ద ముగిసింది. విదేశీ మార్కెట్ల సంకేతాలు, పండుగల సీజన్ డిమాండ్ కారణంగా బంగారం ధర పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్‌కు 1722 డాలర్లు, వెండి ఔన్స్‌కు 20.68 డాలర్ల వద్ద స్థిరత్వంతో ట్రేడవుతోంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ ప్రకారం.. పండుగ డిమాండ్, విదేశీ మార్కెట్‌లలో బంగారం ధరల పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్‌లో బంగారం నిరంతరం పెరుగుతోంది.

ధరలు మరింత పెరిగే అవకాశం..

ఇవి కూడా చదవండి

పండుగల సమయంలో డిమాండ్ పెరగడం, విదేశీ సంకేతాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని ఐఐఎఫ్‌ఎల్ రీసెర్చ్ వీపీ అనూజ్ గుప్తా తెలిపారు. ఇప్పుడు బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బంగారం రూ.53000 స్థాయిని తాకవచ్చు. మరోవైపు, వెండి 63000 నుండి 65000 స్థాయిని తాకవచ్చని అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. కొన్ని నగరాల్లో ఎక్కువ ధర ఉంటే.. మరి కొన్ని నగరాల్లో తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వరుసగా పండగ సీజన్లు ఉండటంతో బంగారం ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..