WhatsApp Banking Services: ఈ 6 బ్యాంకులు వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలు

ఇప్పుడు వాట్సాప్‌లో అనేక బ్యాంకులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, వాట్సాప్‌లకు ఉన్న ఆదరణ దృష్ట్యా బ్యాంకులు వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించాయి..

Subhash Goud

|

Updated on: Oct 06, 2022 | 5:24 PM

ఇప్పుడు వాట్సాప్‌లో అనేక బ్యాంకులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, వాట్సాప్‌లకు ఉన్న ఆదరణ దృష్ట్యా బ్యాంకులు వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించాయి. దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు ఈ సేవను అందించడంలో చేరాయి. వాటిలో స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్లు ఉన్నాయి. మీరు ఈ బ్యాంకుల కస్టమర్ అయితే, మీరు వాట్సాప్‌ బ్యాంకింగ్ సేవలను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.

1 / 6
పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ సేవను ప్రారంభించింది. వాట్సాప్‌లో బ్యాంక్ సంబంధిత పనులను పొందేందుకు కస్టమర్ తన ఫోన్ కాంటాక్ట్‌లో +91-9264092640 సేవ్ చేయాలి. నంబర్‌ను సేవ్ చేసిన తర్వాత, హాయ్, హలో అని టైప్ చేయడం ద్వారా 9264092640కి సందేశం పంపాల్సి ఉంటుంది. బ్యాంకులో రికార్డ్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి సందేశం ఇవ్వాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో రూపొందించబడిన వాట్సాప్ గుర్తుపై క్లిక్ చేయడం ద్వారా కూడా ఈ సేవను పొందవచ్చు.

2 / 6
ఇక స్టేట్ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ సేవను ఉపయోగించడానికి, కస్టమర్ WAREG< >ACCOUNT NUMBER ఫార్మాట్‌లో 7208933148 నంబర్‌కు సందేశాన్ని పంపాలి. ఎస్‌బీఐలో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుండి సందేశం పంపాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత బ్యాంక్‌లో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన వాట్సాప్‌లో నిర్ధారణ సందేశం అందుతుంది. దీని తర్వాత మీ వాట్సాప్ నంబర్ నుండి 919022690266 నంబర్‌కు హాయ్ అని పంపండి. ఆ తర్వాత చాట్‌బాట్ ఇచ్చిన సూచనలను అనుసరించండి.

3 / 6
హెచ్‌డిఎఫ్‌సి చాట్ బ్యాంకింగ్ ఫీచర్ వినియోగదారులకు 7 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. సెలవు రోజుల్లో కూడా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. చాట్ బ్యాంకింగ్ సేవలో కస్టమర్ కేవలం టైప్ చేస్తే చాలు, అతను 90 కంటే ఎక్కువ బ్యాంకింగ్ సౌకర్యాలను పొందడం ప్రారంభిస్తాడు. ఈ ఫీచర్ చాలా సురక్షితమైనది. అలాగే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడింది. ఖాతా సేవ, క్రెడిట్ కార్డ్, రుణం మొదలైన సేవలను ఈ సేవలో పొందవచ్చు. బ్యాంక్‌లో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌లో మాత్రమే ఈ సేవ అందించబడుతుంది. దీని కోసం మీరు మీ ఫోన్ కాంటాక్ట్‌లో 7070022222 నంబర్‌ను సేవ్ చేయాలి. మీరు హాయ్ అని టైప్‌ చేసి ఈ నెంబర్‌కు మెసేజ్‌ పంపాల్సి ఉంటుంది.

4 / 6
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులు వాట్సాప్‌ సేవను పొందవచ్చు. కస్టమర్ తన ఫోన్ కాంటాక్ట్‌లో 8640086400 నంబర్‌ను సేవ్‌ చేసి తర్వాత మీరు ఈ నంబర్‌కు హాయ్ అని పంపాలి. బ్యాంక్‌లో రిజిస్టర్ అయిన వాట్సాప్ మొబైల్ నంబర్ నుండి మెసేజ్ పంపాలి. ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వినియోగదారులు బ్యాంకింగ్ సేవలను కూడా పొందవచ్చు. లేదా కస్టమర్ OPTIN అని రాసి 9542000030 నంబర్‌కు ఎస్‌ఎంఎల్‌ పంపాలి. దీని తర్వాత వాట్సాప్‌లో మెసేజింగ్ ద్వారా చాట్ ప్రారంభమవుతుంది. ఈ వాట్సాప్ సర్వీస్‌లో క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన అనేక సేవలను పొందవచ్చు. ఈ సేవ హిందీలో 9324953010 నంబర్‌లో అందుబాటులో ఉంది.

5 / 6
యాక్సిస్ బ్యాంక్ కస్టమర్‌ల కోసం వాట్సాప్ బ్యాంకింగ్ సేవ కోసం మీ కాంటాక్ట్ లిస్ట్‌లో 7036165000 సేవ్ చేయండి. తర్వాత హాయ్ అని టైప్ చేసి మెసేజ్‌ పంపండి. దీంతో బ్యాంకు వాట్సాప్ రిజిస్టర్ అవుతుంది. దీని తర్వాత ఖాతా, చెక్కు, క్రెడిట్ కార్డ్, ఎఫ్‌డి, రుణం వంటి సౌకర్యాలు వాట్సాప్‌లో అందుబాటులోకి వస్తాయి. వినియోగదారులు ఇక్కడ నుండి వివిధ సేవలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఇలాంటి సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీని కోసం, మీరు మీ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్‌లో బ్యాంక్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ నంబర్ 8433 888 777ని సేవ్ చేయాలి. వాట్సాప్‌ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి ఈ నంబర్‌కి 'హాయ్' అని పంపండి. తర్వాత బ్యాంకింగ్‌ సేవలు పొందవచ్చు.

6 / 6
Follow us