Post Office Gram Suraksha: పోస్టాఫీసుల్లో అద్భుతమైన పథకం.. రోజుకు రూ.50 ఇన్వెస్ట్‌మెంట్‌తో 35 లక్షల బెనిఫిట్‌

కొన్నికొన్ని ప్రభుత్వ స్కీమ్‌లలో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసి ఎక్కువ మొత్తంలో లాభాలు పొందవచ్చు. నెలనెల, ఆరు నెలలు, వార్షిక రూపంలో కూడా డబ్బును..

Post Office Gram Suraksha: పోస్టాఫీసుల్లో అద్భుతమైన పథకం.. రోజుకు రూ.50 ఇన్వెస్ట్‌మెంట్‌తో 35 లక్షల బెనిఫిట్‌
Post Office
Follow us

|

Updated on: Oct 06, 2022 | 3:52 PM

కొన్నికొన్ని ప్రభుత్వ స్కీమ్‌లలో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసి ఎక్కువ మొత్తంలో లాభాలు పొందవచ్చు. నెలనెల, ఆరు నెలలు, వార్షిక రూపంలో కూడా డబ్బును డిపాజిట్‌ చేస్తూ మంచి వడ్డీ రేటును పొందవచ్చు. వివిధ పథకాలపై కేంద్ర ప్రభుత్వం మంచి వడ్డీ రేటును అందిస్తోంది. పోస్టాఫీసులో పెట్టుబడికి వివిధ పథకాలు ఉన్నాయి. ఈ పథకాలలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే ఖచ్చితంగా మెరుగైన రాబడిని పొందుతారు. దీనితో పాటు మీ డబ్బు కూడా పూర్తిగా సురక్షితం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లలో మీ పెట్టుబడికి గ్యారెంటీ రిటర్న్ ఉంది. పోస్టాఫీసుకు చెందిన పథకం విలేజ్ సెక్యూరిటీ స్కీమ్. ఇందులో పెట్టుబడిదారులు కొద్దిగా డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున లాభం పొందవచ్చు. పోస్టాఫీసు గ్రామ సురక్ష పథకం తక్కువ రిస్క్‌తో మెరుగైన రాబడుల ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఈ పథకంలో పెట్టుబడిదారులు ప్రతి నెలా రూ.1500 డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 31 నుండి 35 లక్షల వరకు పొందుతారు.

అర్హత 19 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది కాకుండా ఈ పథకం కింద కనీస బీమా మొత్తం 10 వేల నుండి 10 లక్షల రూపాయల మధ్య ఉంటుంది. ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడిదారులు పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష స్కీమ్ ప్రీమియంను నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లించడానికి కస్టమర్‌కు 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుంది. పాలసీ వ్యవధిలో డిఫాల్ట్ అయిన సందర్భంలో, చందాదారుడు బకాయి ఉన్న ప్రీమియం చెల్లించడం ద్వారా బీమాను పునరుద్ధరించవచ్చు.

పెట్టుబడిదారులు పోస్టాఫీసు గ్రామ సురక్ష స్కీమ్‌లో కూడా రుణం తీసుకోవచ్చు. దీనితో మీరు మూడేళ్లలోపు పథకం కింద పాలసీని సరెండర్ చేయవచ్చు. అయితే సరెండర్ సందర్భంలో పెట్టుబడిదారులు ఎటువంటి ప్రయోజనాలను పొందలేరు.

ఇవి కూడా చదవండి

పెట్టుబడి.. మెచ్యూరిటీ..

ఒక పెట్టుబడిదారుడు 19 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి అతని కనీస హామీ మొత్తం రూ. 10 లక్షలు అని అనుకుందాం. పెట్టుబడిదారులు 55 ఏళ్ల వయస్సులో దాదాపు రూ. 31.60 లక్షలు పొందడానికి నెలకు రూ. 1515 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు నెలకు రూ.1463 చెల్లిస్తే 58 ఏళ్ల వయసులో రూ.33.40 లక్షలు అందుతాయి. అలాగే నెలకు రూ.1411 చెల్లిస్తే, 60 ఏళ్లు నిండిన తర్వాత, రూ.34.60 లక్షల రిటర్న్ ఇవ్వబడుతుంది. అంటే పోస్ట్ ఆఫీస్ పథకంలో మీరు రోజుకు దాదాపు రూ.50 చెల్లించడం ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత రూ.35 లక్షల బలమైన రాబడిని పొందుతున్నారు.

పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంపై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఇటీవల 6.6 శాతం నుండి 6.7 శాతానికి పెంచింది. వరుసగా 9 త్రైమాసికాల తర్వాత చిన్న పొదుపు పథకం పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించింది. డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి కొన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెరిగాయి. దీని కారణంగా ఇప్పుడు పెట్టుబడిదారులు ఈ పథకాలపై ఎక్కువ లాభం పొందవచ్చు. ఇలా పోస్టాఫీసుల్లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు బ్యాంకులకే పరిమితమైన పథకాలు.. ఇప్పుడు పోస్టాఫీసుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. పోస్టల్‌ శాఖ ద్వారా మెరుగైన సేవలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా పోస్టాఫీసులలో మరిన్ని సేవలను ప్రవేశపెడుతోంది. సామాన్యుడి నుంచి సీనియర్‌ సిటిజన్స్‌ వరకు అన్ని రకాల సేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..