PM Kisan Scheme: పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుడు మరణించినా ప్రయోజనం పొందవచ్చు.. ఎలాగంటే..

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పలు పథకాల వల్ల రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఇక మోడీ ప్రభుత్వం..

PM Kisan Scheme: పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుడు మరణించినా ప్రయోజనం పొందవచ్చు.. ఎలాగంటే..
PM Kisan
Follow us

|

Updated on: Oct 06, 2022 | 7:46 PM

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పలు పథకాల వల్ల రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఇక మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకంఒకటి. ఈ స్కీమ్‌ ద్వారా రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున అందుకోవచ్చు. ఏడాదిలో రూ.2000 చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పటి వరకు రైతులకు 11వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 12వ విడత రానుంది. అయితే ఇప్పటి వరకు ఏ తేదీన రైతు ఖాతాల్లో జమ చేస్తారనే విషయం ఇంకా కేంద్రం అధికారికంగా వెల్లడించకపోయినా.. ఈ వారంలో ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు తెలియని అనేక నియమాలు ఉన్నాయి.

వాస్తవానికి, రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకునే రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. అయితే ఈ పథకం లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణించినా, ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు.

లబ్దిదారుడు మరణిస్తే ప్రయోజనం ఎవరికి..?

ఇవి కూడా చదవండి

లబ్ధిదారుడు మరణిస్తే సాగు భూమిని కలిగి ఉన్న రైతు వారసులు ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు. అయితే దీని కోసం కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా రూపొందించబడ్డాయి. ఆ రైతు వారసుడు పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ప్రత్యేకంగా నమోదు చేసుకోవాలి. అంతే కాదు.. ఈ వారసుడు ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలనే షరతులను నెరవేరుస్తున్నాడా లేదా అనేది కూడా చూస్తారు. రైతు వారసుడు ఈ పథకం కింద రూపొందించిన నిబంధనలను నెరవేర్చినట్లయితే, అతను ఈ పథకం ప్రయోజనం పొందుతాడు.

మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, వెంటనే దాన్ని పరిష్కరించుకోండి. ఇందు కోసం మీరు హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా మెయిల్ ఐడిలో మెయిల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. పీఎంకిసాన్‌కు చెందిన హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092లో సంప్రదించవచ్చు. మీరు మీ ఫిర్యాదును ఇ-మెయిల్ ఐడికి కూడా మెయిల్ చేయవచ్చు. మీరు ఇంకా దరఖాస్తు చేసుకోనట్లయితే, అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా సదరు రైతు పేరును నమోదు చేయడం ద్వారా పీఎం కిసాన్‌ ప్రయోజనాన్ని పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..