AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero MotoCorp: హీరో మోటోకార్ప్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్.. స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్.. మరిన్ని అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..

ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి రాగా, మరికొన్ని అందుబాటులోకి..

Hero MotoCorp: హీరో మోటోకార్ప్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్.. స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్.. మరిన్ని అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..
Hero Motocorp
Subhash Goud
|

Updated on: Oct 07, 2022 | 4:43 PM

Share

ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి రాగా, మరికొన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎట్టకేలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ విడా కింద మొదటి స్కూటర్ Vida V1ని విడుదల చేసింది. ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. Vida V1 Plus, V1 Pro. ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక అత్యుత్తమ ఫీచర్లతో పరిచయం చేయబడిందని హీరో పేర్కొంది. ఇందులో టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ కంట్రోల్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధర ఎంత అంటే..

కంపెనీ ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ధరలను నిర్ణయించింది. సుమారు 1.5 లక్షల రేంజ్ లో పరిచయం చేసింది. కంపెనీ Vida V1 Plus ధర రూ.1.45 లక్షలు, V1 Pro ధర రూ.1.59 లక్షలు. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను బుకింగ్‌ అక్టోబర్ 10 నుండి ప్రారంభమవుతుంది. కస్టమర్లు వాటిని రూ.2499తో బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ రెండో వారంలో స్కూటర్ల డెలివరీ ప్రారంభమవుతుంది. ప్రారంభంలో ఈ స్కూటర్ ఢిల్లీ, బెంగళూరు, జైపూర్ అనే మూడు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. డిసెంబర్‌లో రెండో దశలో మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. బుకింగ్ కోసం కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ చేయవచ్చు.

Vida V1 Pro:

ఇది Vida V1 మరింత శక్తివంతమైన వెర్షన్. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ తో 165 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిమీ. ఇది 3.2 సెకన్లలో 0 నుండి 40కిమీల వేగాన్ని అందుకుంటుంది.

ఇవి కూడా చదవండి

Vida V1 Plus:

ఇది Vida V1 తక్కువ శక్తివంతమైన వెర్షన్. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ తో 143 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిమీ. ఇది 3.4 సెకన్లలో 0 నుండి 40కిమీల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంటుంది.

టెస్ట్‌ రైడ్‌ ప్లాన్‌:

కంపెనీ కస్టమర్ల విశ్వాసాన్ని పెంచడానికి కంపెనీ 72 గంటలు లేదా 3 రోజుల పాటు టెస్ట్ రైడ్ ప్లాన్‌ను అందించనుంది. Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ IP67 రేటింగ్. Vida V1 స్మార్ట్‌ఫోన్ ఆన్ వీల్స్ అని కంపెనీ తెలిపింది. అంటే, మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసిన తర్వాత ఇది డిస్ప్లేలో అవసరమైన సమాచారాన్ని చూపుతుంది.

కాగా, ఇప్పపటికే పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల రంగం వైపు అడుగులు వేయగా, మరికొన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేశారు. ద్విచక్ర వాహనాలే కాకుండా కార్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి