Airtel 5g: ఎయిర్‌టెల్ 4జీ సిమ్‌తోనే 5జీ సేవలు.. ఏయే ఫోన్‌లలో సపోర్ట్ చేస్తుందంటే..
ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ 5జీ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎయిర్‌టెల్ 5జీ సేవలను హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిలో ప్రారంభించింది...
ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ 5జీ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎయిర్‌టెల్ 5జీ సేవలను హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిలో ప్రారంభించింది. ఇదిలా ఉంటే ఎయిర్‌టెల్ ఇప్పటి వరకు 5జీ టారిఫ్‌ను మాత్రం ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ ప్లాన్‌లోనే 5జీ సేవల్ని పొందవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. 5జీ స్మార్ట్ ఫోన్ ఏదైనా కస్టమర్లు వినియోగిస్తున్న ప్రస్తుత సిమ్‌లోనే 5జీ పని చేస్తుందని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు.
అంతేకాకుండా సిమ్ మార్చకుండానే ప్రస్తుతం ఉపయోగిస్తున్న 4జీ సిమ్ ను 5జీ మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే యూజర్లు 5జీ, 4జీ నెట్‌వర్క్ ఎంచుకునే అవకాశం కల్పించారు. ఒకవేళ 5జీ నెట్‌వర్క్‌లో డేటా వినయోగం ఎక్కువవుతోందనే భావన కలిగితే 4జీకి మారే వెసులుబాటు కల్పించారు. దీంతో యూజర్ తనకు నచ్చినప్పుడు నచ్చిన నెట్ వర్క్ వాడే వెసులుబాటు లభిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా 5జీ సేవలను 2024లోపు తీసుకొస్తామని ఎయిర్‌టెల్ తెలిపింది. ప్రస్తుతం దశల వారీగా ఎంపిక చేసిన 5జీ సపోర్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో 5జీ నెట్ వర్క్‌ను వినియోగించుకోవచ్చని ఎయిర్ తెలిపింది.
ఎయిర్ 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ చేస్తున్న ఫోన్ల జాబితాలో శామ్‌సంగ్, రియల్‌మీ, వన్‌ప్లస్, షావోమీ, ఒప్పో, వివో కంపెనీలకు చెందిన పలు మోడల్స్ ఉన్నాయి. యూజర్లు 5జీ నెట్‌వర్క్‌తో 600 ఎమ్‌బీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్‌నెట్ సేవలను పొందొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..