AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Image: మీరు గూగుల్‌ నుంచి ఫోటోలను డౌన్‌లోడ్‌ చేస్తున్నారా? అవి ఒరిజినలా? కదా.. తెలుసుకోండిలా!

Google Image: మనం గూగుల్‌ నుంచి రకరకాల ఫోటోలను డౌన్‌లోడ్‌ చేసుకుంటాము. అయితే మనకు కావాల్సిన ఫోటోలు గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటాయి..

Google Image: మీరు గూగుల్‌ నుంచి ఫోటోలను డౌన్‌లోడ్‌ చేస్తున్నారా? అవి ఒరిజినలా? కదా.. తెలుసుకోండిలా!
Google
Subhash Goud
|

Updated on: Oct 06, 2022 | 8:45 PM

Share

Google Image: మనం గూగుల్‌ నుంచి రకరకాల ఫోటోలను డౌన్‌లోడ్‌ చేసుకుంటాము. అయితే మనకు కావాల్సిన ఫోటోలు గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటాయి. అందులో మనకు కావాల్సిన ఫోటోలను తీసుకుంటాము. కానీ ఆ ఫోటోలు ఒరిజినలా..? కాదా.. అనే విషయం తెలియదు. మీరు గూగుల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే ఫోటోలు అసలైన ఫోటోలా? లేక నకిలీవా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. గూగుల్‌లో కొన్ని ఫోటోలు గ్రాఫిక్స్‌తో తయారు చేసి ఉంటాయి.

గ్రాఫిక్స్‌తో తయారు చేసిన ఫోటోలు ఎక్కువ శాతం రాజకీయ నాయకులు, సెలబ్రేటీలవి ఉంటాయి. నిజమైన ఫోటోలు కాకుండా గ్రాఫిక్స్‌ను జోడించినవి ఉంటాయి. అలాంటి ఫోటోలను చిన్న ట్రిక్‌ను ఉపయోగించి గుర్తించే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఫోటోలను సెర్చ్‌ చేయడానికి ప్రధానంగా ఉపయోగించేది గూగుల్‌. గూగుల్‌లో మనకు కనిపించే ఫోటోలు నిజమా..? కదా అనేది గూగుల్‌ ఇమేజెస్‌ మనకు రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ ఆప్షన్‌ను అందిస్తుంది. మనం ఏదైనా ఇమేజ్‌ వెతికినప్పుడు ఆ ఇమేజ్‌ విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే గూగుల్‌ ఇమేజెస్‌కు వెళ్లి కెమెరా ఐకాన్‌ మీద క్లిక్‌ చేయాలి. మీరు చూసిన ఫోటో యూఆర్‌ఎల్‌ లేదా ఆ ఫోటోను నేరుగా అప్లోడ్‌ చేయాలి. అప్పుడు వెంటనే గూగుల్‌ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందో.. దాని మూలం ఎక్కడిదో మనకు పూర్తిగా తెలిసిపోతుంది.

గూగుల్‌ సెర్చ్‌:

ఇవి కూడా చదవండి

మీ ఆండ్రాయిడ్‌ పరికరంలో గూగుల్‌ రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ చేయడానికి మీరు రివర్స్‌ సెర్చ్‌ చేయాలనకుంటున్న ఫోటోలను సెలెక్ట్‌ చేసి దానిమీద రైట్‌ క్లిక్‌ చేయండి. అప్పుడు మీరు సెర్చ్‌ గూగుల్‌ ఫర్‌ ఇమేజ్‌ క్లిక్‌ చేస్తే గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలిసిపోతుంది. ఇలా ఆ ఫోటో నకిలీదా..? లేదా అనే విషయాన్ని తెలుసుకునే వీలుంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్