AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్‌ చేశారా..? ఎవరో తెలుసుకోవడం ఎలా..? ఇలా చేయండి

ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి ఫోన్‌లో వాట్సాప్‌ లేనిది ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు..

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్‌ చేశారా..?  ఎవరో తెలుసుకోవడం ఎలా..? ఇలా చేయండి
Whatsapp
Subhash Goud
|

Updated on: Oct 05, 2022 | 6:49 PM

Share

ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి ఫోన్‌లో వాట్సాప్‌ లేనిది ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు చాలా మంది. అంతేకాదు కార్యాలయాల్లో ఉద్యోగులకు వాట్సాప్‌ లేనిది పనులు జరగడం లేదు. వాట్సాప్‌ గ్రూపులు, చాటింగ్‌లతో నిత్యం వాట్సాప్‌ ఓ భాగమైపోయింది. ఇది లేనిది రోజు గడవని పరిస్థితి నెలకొంది. ఇక వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్‌ సంస్థ కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.

వాట్సాప్‌ సంస్థ ఇప్పటికే అనేక ఫీచర్స్‌ను తీసుకురాగా మరికొన్ని ముఖ్యమైన ఫీచర్స్‌ను తీసుకువస్తోంది. అవి పరీక్ష దశల్లో ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇక వాట్సాప్‌లో కొందరిని బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతుంటారు. వారిని బ్లాక్‌ చేస్తే ఎవరు బ్లాక్‌ చేశారోననే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇందు కోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే వాట్సాప్‌లో పలు ప్రైవసీ కారణాల వల్ల మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేరు. అయితే కొన్ని పద్ధతులను అనుసరిస్తే మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో చాలా సులభంగా తెలుసుకునే వీలుంటుంది.

  1. ప్రొఫైల్ పిక్చర్ ఉందో లేదో చూడండి: ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌ చేస్తే ముందుగా ప్రొఫైల్ పిక్చర్ నుంచే తెలుసుకునే అవకాశం ఉంది. మీకు వారి ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తే.. అవతలి వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేయనట్లే. కనిపించకపోతే మాత్రం ఇందులో ఉన్న ఇతర పద్ధతులు కూడా ఫాలో అవ్వండి. ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుకుంటున్నారో.. వారి లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేయడానికి ప్రయత్నించండి. అయితే వాళ్లు లాస్ట్ సీన్ డిజేబుల్ చేస్తే బ్లాక్ చేయకపోయినా కనిపించదు. ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించకపోతే కచ్చితంగా బ్లాక్ చేసినట్లే.
  2. ఒకవేళ అవతలి వ్యక్తులు మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. మీకు కేవలం ఒక్క టిక్ మాత్రమే వస్తుంది. రెండు టిక్ మార్కులు, బ్లూ టిక్స్ కనిపించవు. అందుకే మీరు మెసేజ్ పెట్టి ఎంత సేపయినా ఈ టిక్స్ రాకపోతే మిమ్మల్ని దాదాపు బ్లాక్ చేసినట్లేనని గుర్తించాలి. అంతేకాకుండా మిమ్మల్ని బ్లాక్ చేసినవారికి మీరు కాల్ చేస్తే ఆ కాల్ అవతలివారికి వెళ్లదు. అక్కడ మీకు రింగింగ్ బదులు కాలింగ్ అని మాత్రమే వస్తుంది. అయితే అవతలివాళ్లు ఇంటర్నెట్ ఆపినా కాలింగ్ అనే వస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. వారితో మీరు గ్రూప్ క్రియేట్ చేయడం కూడా కుదరదు. అందుకే ఎవరైతే బ్లాక్ చేశారని మీరు అనుకుంటున్నారో వారితో గ్రూప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. అయితే అవతలివాళ్లు ప్రొఫైల్ పిక్చర్ డిలీట్ చేసి, లాస్ట్ సీన్ హైడ్ చేసి, నెట్ ఆఫ్ చేసినా పైవన్నీ జరుగుతాయి. అయితే నెట్ ఆఫ్ చేసిన వాళ్లు కాసేపటికి అయినా ఆన్ చేస్తారు కాబట్టి.. ఇవన్నీ జరిగితే దాదాపు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే అనుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!