Moto E32: మోటో నుంచి బడ్జెట్ ఫోన్.. రూ. 11 వేలలోపు 50 మెగాపిక్సెల్ కెమెరా.. మరెన్నో ఫీచర్లు..
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ మోటోరోలో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటీ ఈ32 పేరుతో వచ్చిన ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరకే అందుబాటు ధరలో తీసుకొచ్చారు. ఇప్పటికే యూరప్‌లో విడుదలైన ఈ ఫోన్‌ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేశారు...
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ మోటోరోలో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటీ ఈ32 పేరుతో వచ్చిన ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరకే అందుబాటు ధరలో తీసుకొచ్చారు. ఇప్పటికే యూరప్‌లో విడుదలైన ఈ ఫోన్‌ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కొనసాగుతోంది. ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇక ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంతలాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఈ స్మార్ట్‌ఫోన్‌ను 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరయింట్‌తో కేవలం ఒకే మోడల్‌లో విడుదల చేశారు. కాస్మిక్ బ్లాక్, ఐస్‌బర్గ్ బ్లూ కలర్స్‌లో తీసుకొచ్చిన ఈ ఫోణ్ ధర విషయానికొస్తే రూ. 10,499గా ఉంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 720×1,600 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 6.5 ఇంచెస్ ఐపీఎస్ ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. ఇక ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో జీ37 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. అలాగే కెమెరాలు 30 ఎఫ్‌పీఎస్ వద్ద పూర్తి హెచ్‌డీ వీడియోలను రికార్డ్ చేయగలగడం విశేషం. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో మెమరీని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లను అదనంగా ఇచ్చారు. ఇక ఇందులో 5,000 ఎమ్‌ఏహెచ్ వంటి శక్తివంతమైన బ్యాటరీని అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..