Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppo 4G A77: ఒప్పో నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్స్‌..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఏ77 పేరుతో తీసుకొచ్చిన ఈ 4జీ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో అదిరిపోయే ఫీచర్లతో పరిచయం చేసింది. ఇటీవల వరుసగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వస్తోన్న ఒప్పో..

Oppo 4G A77: ఒప్పో నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్స్‌..
Oppo 4g A77
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 08, 2022 | 9:40 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఏ77 పేరుతో తీసుకొచ్చిన ఈ 4జీ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో అదిరిపోయే ఫీచర్లతో పరిచయం చేసింది. ఇటీవల వరుసగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వస్తోన్న ఒప్పో తాజాగా ఇలాంటి మరో ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.56 ఇంచెస్‌ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పని చేసే ఒప్పో ఏ 77లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించారు. సూపర్ వూక్‌ చార్జర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ను కేవలం 5 నిమిసాలు ఛార్జింగ్‌ చేస్తే మూడు గంటల పాటు కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. 3.5 ఎంఎం ఆడియో జాక్‌, 4జీ తోపాటు వై-ఫై, బ్లూటూత్ క‌నెక్టివిటీ త‌దిత‌ర ఫీచ‌ర్లను అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ రూ. 17,999గా ఉంది. పలు బ్యాంకుల క్రెడిట్, డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం ఉంది.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ప్రత్యక్ష ఆకర్షణగా చెప్పాలి. ఇందులో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. రెయిర్‌ కెమెరాకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతను జోడించడం విశేషం. ఇక క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 128 జీబీ వ‌ర‌కు ఇంట‌ర్నల్ స్టోరేజీని పెంచుకోవచ్చు. శుక్రవారం నుంచి ప్రముఖ ఈ కామర్స్‌ సైట్స్‌తో పాటు, ఓప్పో స్టోర్‌లలో అందుబాటులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..