Depression: సోషల్ మీడియాలో అధిక సమయం గడిపే వారు 6 నెలల్లోనే డిప్రెషన్‌లోకి.. తాజా పరిశోధనల్లో వెల్లడి!

సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారా? జాగ్రత్త.. అటువంటి వ్యక్తులు కేవలం 6 నెలల్లోనే డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉందని జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం వెల్లడించింది..

Depression: సోషల్ మీడియాలో అధిక సమయం గడిపే వారు 6 నెలల్లోనే డిప్రెషన్‌లోకి.. తాజా పరిశోధనల్లో వెల్లడి!
Social Media Causes Depression
Follow us

|

Updated on: Oct 06, 2022 | 6:50 PM

సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారా? జాగ్రత్త.. అటువంటి వ్యక్తులు కేవలం 6 నెలల్లోనే డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉందని జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం.. ఇటీవల కాలంలో అధిక శాతం మంది యువత వివిధ సోషల్‌ మీడియా మాధ్యమాలను విపరీతంగా వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఆర్కాన్సాస్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్‌ అభ్యసించే డాక్టరల్ విద్యార్థి అయిన రెనే మెర్రిల్ బృంధం ‘సోషల్ మీడియా వినియోగం, వ్యక్తిత్వ వికాస అభివృద్ధి మధ్య సంబంధం’ పేర నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వ్యక్తుల్లో అభివృద్ధి చెందే డిప్రెషన్‌ వివిధ కారకాలతో ముడిపడి ఉంటుందని వీరు తెలిపారు.

సోషల్ మీడియాను వినియోగించే భిన్న వ్యక్తిత్వాలున్న వ్యక్తులు ఏ విధంగా డిప్రెషన్‌ బారీన పడుతున్నారో వీరి పరిశోధనల్లో బయటపడింది. తక్కవ అగ్రియబుల్‌నెస్‌ ఉన్న వారి కంటే అధిక అగ్రియబుల్‌నెస్‌ ఉన్న వారు 49 శాతం అధికంగా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. అంతేకాకుండా అధిక న్యూరోటిసిజం ఉన్నవారు రోజుకు 300 నిమిషాలకు పైగా సోషల్ మీడియాను వినియోగిస్తున్నారని, తక్కువ న్యూరోటిసిజం ఉన్నవారి కంటే డిప్రెషన్‌ను అభివృద్ధి చెందే అవకాశం వీరిలో రెండు రెట్లు ఎక్కువ అని తెలిపారు. డిప్రెషన్‌ డెవలప్‌ అవడంలో వ్యక్తుల వ్యక్తిత్వం, సోషల్ మీడియా వినియోగంతో ముడిపడి ఉందని పరిశోధకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

2018 నుంచి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల 1,000కి పైగా అమెరికా యువత నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎక్కువ సమయం సోషల్‌ మీడియాలో నిమగ్న మవ్వడం వల్ల ఇంటి వెలపలే ఒంటరిగా ఉంటూ ఇతర కార్యకలాపాలకు దూరంగా ఉండటం వల్ల డిప్రెషన్‌ అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు డిప్రెషన్ ప్రధాన కారణంగా వీరి పరిశోధనల్లో గుర్తించారు. వ్యక్తులతో వర్చువల్‌గా కనెక్ట్ అవ్వడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేసే సంభావ్యత ఎక్కువ. మనలోని భావోద్వేగాలు ఇతరులతో డైరెక్ట్‌గా పంచుకోవడం వల్ల, వారు మన పట్ల శ్రద్ధ వహించడం వంటి విషయాలు వ్యక్తులతో కమ్యూనికేషన్ మరింత మెరుగుపరుతుంది. సోషల్‌ మీడియాల ద్వారా సంభాషించడం కన్నా ముఖాముఖిగా మాట్లాడుకోవడం వల్ల మానవ సంబంధాల నాణ్యతను మెరుగుపరచుకోవచ్చు. ఈ విధమైన సంస్కృతి మానసిక సమస్యలను దరిచేరకుండా నివారిస్తుందని పరిశోధన బృంధం సూచించింది.