Hair Care Tips: జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా..? దీనిని ఇలా ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితం..

డ్రై ఫ్రూట్స్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. వాటిలో.. వాల్ నట్ కూడా ఒకటి.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్నే బ్రెయిన్ ఫుడ్ అని కూడా అంటారు.

Hair Care Tips: జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా..? దీనిని ఇలా ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితం..
Walnuts
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 06, 2022 | 5:50 PM

డ్రై ఫ్రూట్స్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. వాటిలో.. వాల్ నట్ కూడా ఒకటి.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్నే బ్రెయిన్ ఫుడ్ అని కూడా అంటారు. అదే సమయంలో దీనిని తీసుకోవడం ద్వారా, మీ జ్ఞాపకశక్తి కూడా చురుకుగా మారుతుంది. అయితే వాల్‌నట్స్ జుట్టుకు కూడా చాలా హెల్తీ అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. జుట్టు పెరుగుదలకు వాల్‌నట్ చాలా మంచిదని, ఇది మీ స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు. వాల్‌నట్‌లను తింటే జట్టు సమస్యలన్నీ దూరమవుతాయని.. జుట్టు రాలడం, చుండ్రు తదిదర సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు అక్రోట్లను ఎలా ఉపయోగిస్తే మేలు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టుకు వాల్‌నట్స్‌ వల్ల కలిగే ప్రయోజనాలు..

  • జుట్టులో వాల్‌నట్‌లను ఉపయోగించడం వల్ల పెరుగుదల మెరుగుపడుతుంది.
  • వాల్నట్ జుట్టు నుంచి చుండ్రు, దురద సమస్యను తొలగిస్తుంది.
  • వాల్ నట్స్ వాడటం వల్ల జుట్టు నల్లబడుతుంది.
  • వాల్‌నట్ జుట్టులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

జుట్టు పెరుగుదల కోసం ఈ విధంగా వాల్‌నట్‌లను ఉపయోగించండి

రోజూ రెండు వాల్‌నట్‌లను తినండి: వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వినియోగం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, జుట్టు పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది. అందువల్ల, మీరు ప్రతిరోజూ 2 వాల్‌నట్‌లను తీసుకోవాలి.

వెజిటెబుల్ నూనెతో వాల్‌నట్‌లను ఉపయోగించండి: జుట్టుపై వాల్‌నట్‌లను ఉపయోగించడానికి రెండింటిని లేదా సరిపడే విధంగా తీసుకోండి. దీన్ని ఒకటిన్నర కప్పు వెజిటబుల్ ఆయిల్‌లో వేసి కాసేపు మరిగించాలి. ఆ తర్వాత దానిని ఫిల్టర్ చేసి మీ జుట్టుకు పట్టించాలి. ఇది మీ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

పెరుగు – వాల్‌నట్‌ మాస్క్: చుండ్రుకు చెక్ పెట్టి.. జుట్టుకు మంచి పోషణను అందించడానికి పెరుగులో వాల్‌నట్ లను ఉపయోగించండి. పెరుగు వాల్నట్ పొడిని బాగా కలపండి. ఆ తర్వాత మీ తలకు అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. అనంతరం జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల జుట్టుకు మంచి పోషకాలు అంది సమస్యలు దూరమవుతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పల్లెవెలుగు బస్‌‌లో ఉరి వేసుకున్న యువకుడు
పల్లెవెలుగు బస్‌‌లో ఉరి వేసుకున్న యువకుడు
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం