ESIC Sanathnagar Jobs 2022: రూ.2 లక్షల జీతంతో సనత్‌నగర్‌ ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోనున్న ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

ESIC Sanathnagar Jobs 2022: రూ.2 లక్షల జీతంతో సనత్‌నగర్‌ ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..
ESIC Sanathnagar
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 06, 2022 | 5:13 PM

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోనున్న ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌.. ఒప్పంద ప్రాతిపదికన 8 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రేడియో డయాగ్నోసిస్‌ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత స్పెషలేజేషన్‌లో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు 69 యేళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు అక్టోబర్‌ 8, 2022వ తేదీన కింది అడ్రరస్‌ల నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలు/ఇతర అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి కింది విధంగా జీతభత్యాలు ఉంటాయి.

పోస్టుల వారీగా పే స్కేల్‌ వివరాలు..

ఇవి కూడా చదవండి
  • సీనియర్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.2,78,595
  • ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.2,28,942
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1,52,241
  • సీనియర్‌ రెసిడెంట్ పోస్టులకు నెలకు రూ.67,000ల వరకు జీతంగా చెల్లి్స్తారు.

అడ్రస్: ESIC Medical College, Sanathnagar, Hyderabad, Telangana.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.