Group 1 Exam dates: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ, మెయిన్స్‌ రాత పరీక్ష తేదీలు ఇవే.. అక్టోబర్ 13 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 92 గ్రూప్‌ -1 సర్వీసుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూపు-1 పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది..

Group 1 Exam dates: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ, మెయిన్స్‌ రాత పరీక్ష తేదీలు ఇవే.. అక్టోబర్ 13 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం..
APPSC Group 1
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 17, 2023 | 9:27 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 92 గ్రూప్‌ -1 సర్వీసుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూపు-1 పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమినరీ రాత పరీక్ష డిసెంబరు 18న నిర్వహించనున్నట్లు ప్రాథమికంగా వెల్లడించింది. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇక మెయిన్‌ రాత పరీక్ష వచ్చే ఏడాది మార్చి 15 తర్వాత నిర్వహించనున్నట్లు తెల్పింది. ఐతే ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్‌ 1 పరీక్ష సివిల్స్‌ పరీక్ష విధానాన్ని పోలి ఉంటుంది. అంతేకాకుండా సిలబస్‌ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. అందువల్ల ప్రిలిమినరీ రాత పరీక్షకు, మెయిన్‌ పరీక్షకు మధ్య ఎక్కువ వ్యవధిలేదని గ్రూప్స్ ఆశావహ అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. మెయిన్స్‌ పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి మరింత సమయం కావాలని, పరీక్ష తేదీని మరికొన్ని రోజులకు పొడిగించాలని ఎమిషన్‌ను కోరుతున్నారు.

కాగా ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 13వ తేదీన ప్రారంభం కానుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు నవంబర్‌ 2, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.370లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.120లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. జోన్ల వారీగా పోస్టులను కేటాయిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.