Adipurush: ‘ఆదిపురుష్‌’ టీజర్ ట్రోల్స్‌పై తొలిసారి స్పందించిన డైరెక్టర్ ఓం రౌత్‌!.. ఏమన్నారంటే..

నిమిషం యాభై సెకన్ల నిడివి గల 'ఆదిపురుష్‌' టీజర్‌లో VFX చాలా దారుణంగా ఉందని, హాలీవుడ్‌ మువీ సీన్స్‌ కాపీ కొట్టారని, కార్టూన్‌ మువీలా ఉందని అభిమానులతోపాటు సినీ విమర్శకులు సైతం పెదవి విరిచారు. ఇక సోషల్‌ మీడియాలోనైతే ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు అభిమానులు. ఈ విమర్శలపై దర్శకుడు ఓం రౌత్‌ తాజాగా..

Adipurush: 'ఆదిపురుష్‌' టీజర్ ట్రోల్స్‌పై తొలిసారి స్పందించిన డైరెక్టర్ ఓం రౌత్‌!.. ఏమన్నారంటే..
Adipurush director Om Raut
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 05, 2022 | 6:18 PM

రామాయణ ఇతివృత్తంతో.. ఓం రౌత్‌ డైరెక్షన్‌లో.. తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్‌’ సినిమాలో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తు్న్నారు. దసరా కనుకగా ఈ సినిమా టీజర్‌ గత ఆదివారం అయోధ్య వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఐతే భారీ అంచనాలతో విడుదల చేసిన ‘ఆదిపురుష్‌’ టీజర్‌ అభిమానులను కొంత నిరాశ పరిచింది. నిమిషం యాభై సెకన్ల నిడివి గల ‘ఆదిపురుష్‌’ టీజర్‌లో VFX చాలా దారుణంగా ఉందని, హాలీవుడ్‌ మువీ సీన్స్‌ కాపీ కొట్టారని, కార్టూన్‌ మువీలా ఉందని అభిమానులతోపాటు సినీ విమర్శకులు సైతం పెదవి విరిచారు. ఇక సోషల్‌ మీడియాలోనైతే ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు అభిమానులు. ఈ విమర్శలపై దర్శకుడు ఓం రౌత్‌ తాజాగా స్పందించారు. ఆదిపురుష్ టీజర్ సెల్ ఫోన్‌లో చూసేందుకు చిత్రీకరించలేదని, అది ఫోన్‌లో చూడలేనంత భారీ చిత్రమని, పెద్ద స్క్రీన్‌పై అద్భుతంగా కనిపిస్తుందని అన్నారు. ఇంకా ఈ విధంగా మాట్లాడారు..

‘ఆది పురుష్‌’ టీజర్‌పై వస్తున్న ట్రోలింగ్‌ చూసి కాస్త ధైర్యం కోల్పోయిన మాట వాస్తవమే. ఐతే ట్రోలింగ్‌లకు నేనేమీ పూర్తిగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఈ సినిమా పెద్ద స్క్రీన్‌ కోసం తీశాం. మొబైల్‌ ఫోన్‌లో చూడటానికి కొంత భిన్నంగానే ఉంటుంది. అది నేను నియంత్రించలేని వాతావరణం. థియేటర్‌లో తెరసైజు తగ్గచ్చేమో కానీ, ఆ పరిమాణాన్ని మరీ మొబైల్‌కు తగ్గించకూడదు. నాకొక అవకాశం ఇస్తే యూట్యూబ్‌లో పెట్టకుండా నిరోధించగలను. నాకు అది కేవలం ఓ గంట పని మాత్రమే. కానీ, ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్ధేశ్యంతోనే యూట్యూబ్‌లో ఉంచాం. కేవలం ప్రేక్షకుల ఆనందం కోసం మాత్రమే టీజర్‌ విడుదల చేశాం. చిత్రం విడుదలకు ఇంకా వందకు పైగా రోజుల సమయం ఉంది. నా పార్ట్‌నర్‌, స్టూడియో (టీ-సిరీస్) ప్రపంచంలోనే అతిపెద్ద యూట్యూబ్‌ ఛానెల్ ఉంది. థియేటర్లలో అరుదుగా సినిమాలు చూసే వాళ్ల కోసం ఈ సినిమా తీయలేదు. సీనియర్‌ సిటిజన్లు, మారుమూల గ్రామాల్లో థియేటర్లు అందుబాటులో లేని వారు థియేటర్లలో సినిమా చూసేందుకు రప్పించడం మా ప్రధాన ఉద్ధేశ్యం. ఎందుకంటే ఈ సినిమా రామాయణం అని రౌత్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

గ్లోబల్ కంటెంట్‌ని చూడాలనే ఆసక్తి ఉన్న పెద్దల నుంచి పిల్లల వరకు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అర్థమయ్యే భాషలో, ఎక్కువ మందికి చేరువచేసేందుకు 3డీ మోషన్‌ను ఎంచుకున్నాం. చిన్న స్క్రీన్‌పై చూడటానికి మాత్రం ‘ఆది పురుష్‌’ తీయలేదని, పెద్ద తెరపై చూస్తేనే తాము తీసే కంటెంట్‌ విలువ తెలుస్తుందని రౌత్ స్పష్టం చేశారు. కాగా ఆదిపురుష్ వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించబడింది. వచ్చే ఏడాది జనవరి 12న 2D, 3D, IMAX 3D ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా ‘ఆది పురుష్‌’ విడుదల కానుంది.