Coal India Jobs 2022: కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు.. రూ.2 లక్షల జీతం..

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన ఒరిస్సా రాష్ట్రంలోని బుర్లాలోనున్న కోల్‌ ఇండియా లిమిటెడ్.. 66 మెడికల్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

Coal India Jobs 2022: కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు.. రూ.2 లక్షల జీతం..
Coal India Limited
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 05, 2022 | 4:55 PM

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన ఒరిస్సా రాష్ట్రంలోని బుర్లాలోనున్న కోల్‌ ఇండియా లిమిటెడ్.. 66 మెడికల్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సర్జన్, జనరల్ ఫిజిషియన్, జి అండ్‌ ఓ, అనస్తీషియా, ఆర్థోపెడిక్, పీడియాట్రీషియన్‌, సైకియాట్రిక్‌, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్‌, పల్మనాలజిస్ట్‌/చెస్ట్ స్పెషలిస్ట్‌, రేడియాలజిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, డీఎన్‌బీ, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దారఖాస్తుదారుల వయసు 35 నుంచి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్‌ 29, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ/అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • సీనియర్ మెడికల్ స్పెషలిస్టు (E4)/ మెడికల్ స్పెషలిస్టు (E3) పోస్టులు: 45
  • సీనియర్ మెడికల్ ఆఫీసర్ (E3) పోస్టులు: 18
  • సీనియర్ మెడికల్ ఆఫీసర్ – డెంటల్ (E3) పోస్టులు: 3

అడ్రస్: Dy. GM/HoD(EE), Mahanadi Coalfields Limited, Jagriti Vihar, at Burla, Sambalpur, Odisha 768020

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.