IPR Gandhinagar Jobs 2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్మా రీసెర్చ్‌లో కొలువులు.. పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు..

కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్‌ ఎనర్జీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్మా రీసెర్చ్‌.. 10 స్టైపెండరీ ట్రైనీ (కేటగిరీ-2) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

IPR Gandhinagar Jobs 2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్మా రీసెర్చ్‌లో కొలువులు.. పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు..
IPR Gandhinagar
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 05, 2022 | 2:42 PM

కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్‌ ఎనర్జీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్మా రీసెర్చ్‌.. 10 స్టైపెండరీ ట్రైనీ (కేటగిరీ-2) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్) తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితోపాటు, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 4, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ప్రిలిమినరీ టెస్ట్ (స్టేజ్-1), అడ్వాన్స్‌డ్ టెస్ట్ (స్టేజ్-2), ట్రేడ్/స్కిల్ టెస్ట్ (స్టేజ్-3) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో మొదటి ఏడాది నెలకు రూ.10,500లు, రెండో ఏడాది నెలకు రూ.12,500లు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ట్రైనింగ్‌ పూర్తయిన తర్వాత టెక్నీషియన్‌-బి కేటగిరి పోస్టులో నెలకు రూ.21,700లతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.

ప్రిలిమినరీ రాత పరీక్ష విధానం: మొత్తం 50 మల్టిపుల్‌ ఛాయిస్ ప్రశ్నలకు గంట వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.

  • మ్యాథమెటిక్స్‌ విభాగం నుంచి 20 ప్రశ్నలు
  • సైన్స్ విభాగం నుంచి 20 ప్రశ్నలు
  • జనరల్ అవేర్‌నెస్ నుంచి 10 ప్రశ్నలు

అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌.. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే స్టేజ్‌-2 పరీక్ష రాయడానికి అర్హులు. అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌లో 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. మెరిట్‌ ఆధారంగా స్టేజ్‌-3 స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.