- Telugu News Photo Gallery 'Boycott Adipurush' trends on Twitter: Have you seen these hilarious memes on Om Raut's Adipurush
Boycott Adipurush: ఓం రౌత్ ‘ఆదిపురుష్’ టీజర్‌ను ఆటాడేసుకుంటున్న నెటిజన్లు! వైరల్ అవుతున్న రావణుడి ఫన్నీ మీమ్స్..
ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ విడుదలైనప్పటి నుంచి దానిలోని సన్నివేశాలకు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
Updated on: Oct 04, 2022 | 7:37 PM

ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ విడుదలైనప్పటి నుంచి దానిలోని సన్నివేశాలకు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఆక్వామ్యాన్, రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ వంటి హాలీవుడ్ చిత్రాల నుంచి ఈ సన్నివేశాలను కాపీ కొట్టారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక వీటిపై మీమ్స్ క్రియేట్ చేసి 'బాయికాట్ ఆదిపురుష్' హ్యాష్ ట్యాగ్ జోడించి రచ్చ చేస్తున్నారు.

రామాయణ కథ ఆధారంగా రూపొందిస్తున్న ఆదిపురుష్ మువీలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, సీతగా కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను టెంపుల్ రన్ గేమ్‌తో పోల్చుతున్నారు. ఆదిపురుష్ పాత్రలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

సైఫ్ అలీఖాన్ రావణుడి లుక్ ఏ మాత్రం నచ్చని నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు. ఇవి కాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి.




