- Telugu News Photo Gallery UK couple sets Guinness World Record for biggest height difference of husband and wife
ఆమె 5 అడుగులు, అతను 3 అడుగులు.. గిన్నీస్ రికార్డుకెక్కిన లవ్ స్టోరీ! ‘ఏ పుస్తకాన్నైనా కవర్ చూసి అంచనా వేయకూడదు’
ఏ పుస్తన్నైనా దాని కవర్ చూసి అంచనా వేయకూడదు. లైఫ్‌లో ఎవరిని ప్రేమించాలో, ఎవరి మధ్య ఎలా ప్రేమ పుడుతుందో ఎవరూ నిర్ణయించలేరు..
Updated on: Oct 04, 2022 | 9:55 PM

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2023 ఎడిషన్‌ను తాజాగా విడుదలైంది. దీనిలో బ్రిటన్‌కు చెందిన జేమ్స్, క్లో లస్టెడ్ పేర్లు కూడా ఉన్నాయి. భార్యాభర్తల పొడవులో అత్యంత ఎక్కువ వ్యత్యాసం ఉన్న దంపతులుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. వీరిరువురి ఎత్తులో ఒక అడుగు 9 అంగుళాల వ్యత్యాసం ఉంది. భర్త 3 అడుగుల 7 అంగుళాలుండగా, భార్య 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్నప్పటికి వీరి దాంపత్య జీవితం ఎంతో సాఫీగా సాగిపోతోంది.

జేమ్స్, క్లో 2016లో వివాహం చేసుకున్నారు. జూన్ 2, 2021న ఈ జంట పేరిట గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్నారు. టీవీ హోస్ట్‌గా పనిచేస్తున్న 34 ఏళ్ల జేమ్స్, స్కూల్ టీచరైన 27 ఏళ్ల క్లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

2012లో ఓ పబ్‌లో చిగురించిన వీరి స్నేహం అనంతరం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఐతే పుట్టుకతోనే డిస్ట్రోఫిక్ డైస్‌ప్లాసియా అనే అరుదైన వ్యాధితో జేమ్స్ జన్మించడంతో అతని ఎత్తు కొన్నాళ్లకి ఆగిపోయి, మరుగుజ్జుగా మారిపోయాడు.

2021లో ప్రపంచ రికార్డు సాధించిన సందర్భంగా జేమ్స్ మీడియాతో మాట్లాడుతూ.. ఇతర భర్తల మాదిరిగానే అన్ని పనులను నేను కూడా చేయగలను. ఐతే దానిని అమలు చేసే విధానం భిన్నంగా ఉంటుంది. ఏ పుస్తన్నైనా దాని కవర్ చూసి అంచనా వేయకూడదు. లైఫ్‌లో ఎవరిని ప్రేమించాలో, ఎవరి మధ్య ఎలా ప్రేమ పుడుతుందో ఎవరూ నిర్ణయించలేరని భార్య క్లో అన్నారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ జంట ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ దంపతులకు ఒలివియా అనే మూడేళ్ల కుమార్తె కూడా ఉంది.
